పా.రంజిత్ తో సూర్య.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!
ఐతే సూర్యతో మాత్రం ఈసారి చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నారని తెలుస్తుంది. సూర్య ఈ సినిమాను తన కొత్త బ్యానర్ లో చేయడం కూడా స్టోరీ మీద ఉన్న నమ్మకంతోనే అని తెలుస్తుంది.;
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కరుప్పు పూర్తి చేశాడు. ఆర్ జె బాలాజీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వస్తున్న విషయంలో తెలిసిందే. ఐతే సూర్య 48వ సినిమా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. సూర్య 48వ సినిమాగా ఇది రాబోతుంది. సూర్య ఈ సినిమాను తన సొంత ప్రొడక్షన్ లో నిర్మించబోతున్నారు.
సూర్య కొత్త ప్రొడక్షన్..
సూర్య 48వ సినిమాను అగరం స్టూడియోస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. సూర్య ఆల్రెడీ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అగరం స్టూడియోస్ అంటూ మరో కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ పా.రంజిత్ డైరెక్ట్ చేయనున్నాడు. సూర్య పా.రంజిత్ ఈ కాంబో కచ్చితంగా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.
పా రంజిత్ ప్రస్తుతం వెట్టువం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది. మరోపక్క సూర్య కూడా వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా త్వరలో ఫినిష్ చేయనున్నారు. ఈ సినిమాలు పూర్తయ్యాక పా రంజిత్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. పా రంజిత్ డైరెక్షన్ లో సినిమాలన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. విక్రం తో చేసిన తంగళాన్ సినిమా బజ్ బాగానే క్రియేట్ చేసినా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు.
పా రంజిత్, సూర్య కాంబో..
ఐతే సూర్యతో మాత్రం ఈసారి చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నారని తెలుస్తుంది. సూర్య ఈ సినిమాను తన కొత్త బ్యానర్ లో చేయడం కూడా స్టోరీ మీద ఉన్న నమ్మకంతోనే అని తెలుస్తుంది. ఏది ఏమైనా పా రంజిత్, సూర్య కాంబో మాత్రం ఆడియన్స్ కి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది అని ఆశిస్తున్నారు.
కెరీర్ లో మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సూర్య కంగువ, రెట్రో సినిమాలు వచ్చినా వర్క్ అవుట్ కాలేదు. ఐతే నెక్స్ట్ కరుప్పు, వెంకీ అట్లూరి సినిమాలతో మాత్రం టార్గెట్ రీచ్ అవుతాడని అంటున్నారు. మరి ఈ సినిమాలు సూర్యని నిజంగానే కంబ్యాక్ ఇచ్చేలా చేస్తాయా లేదా అన్నది చూడాలి.
సూర్య కూడా ఆడియన్స్ ని మెప్పించే కథలతో రావాలని చూస్తున్నాడు. ఈమధ్య తన సినిమాల రిజల్ట్ పై పూర్తిగా నిరాశలో ఉన్న సూర్య రాబోతున్న సినిమాలతో తానేంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు.