గ్లామర్ ఓవర్ లోడెడ్.. సెగలు పుట్టిస్తున్న సుప్రీత!
ప్రముఖ సీనియర్ నటీమణి , క్యారెక్టర్ ఆర్టిస్ట్, లేడీ కమెడియన్ సురేఖ వాణి కూతురిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది సుప్రీత.
ప్రముఖ సీనియర్ నటీమణి , క్యారెక్టర్ ఆర్టిస్ట్, లేడీ కమెడియన్ సురేఖ వాణి కూతురిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది సుప్రీత. ఇండస్ట్రీలోకి రాకముందే సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీతో పాటు ఫాలోవర్స్ ని కూడా సొంతం చేసుకుంది. చిట్టి పొట్టి బట్టలు ధరించి గ్లామర్ డోస్ తో హీట్ పుట్టిస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించింది. అలా ఇండస్ట్రీలోకి రాకముందే మంచి క్రేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో వచ్చిన లేచింది మహిళా లోకం సినిమాలో ఒక కీలక పాత్ర పోషించి వెండితెరకు పరిచయమైంది.
మరొకవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అమర్దీప్ చౌదరితో 'చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఇంకా విడుదలకు సిద్ధం కాలేదు. మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నిన్నటికి నిన్న సాంప్రదాయంగా ట్రెడిషనల్ లుక్ లో లెహంగా ధరించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. తాజాగా సమ్మర్ స్పెషల్ సందర్భంగా మరో ఔట్ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వేసవి కాలానికి అనువుగా ఉండే వైట్ ఓవర్ సైజ్ షర్ట్ ధరించిన ఈమె దీనికి కాంబినేషన్ లో డెనిమ్ జీన్ షార్ట్ ధరించి చాలా క్యాజువల్ గా కూర్చున్న ఫోటోలను పంచుకుంది. ముఖ్యంగా ఈమె ధరించిన యాక్సెసరీస్ విషయానికి వస్తే.. గ్రీన్ కలర్ బ్యాగ్ ధరించిన ఈమె..స్మార్ట్ వాచ్, బంగారు ఆభరణాలతో చాలా సింపుల్ గా కనిపించింది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో కూడిన చూపుతో.. సున్నితమైన చిరునవ్వుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మొత్తానికి అయితే సింపుల్ లుక్ లో చాలా గ్లామర్ ఫోజులిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇంస్టాగ్రామ్ వేదికగా సుప్రీత పంచుకున్న ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
సుప్రీత 2001 ఆగస్టు 8న హైదరాబాద్లో జన్మించింది. తెలుగు నటి సురేఖవాణి కూతురుగా అటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా, మోడల్ గా, తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె ఈ గ్లామరస్ ఫోటో షూట్ లు, డాన్స్ వీడియోలతో, లైఫ్ స్టైల్ కంటెంట్ తో విపరీతమైన ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంది. 2019లో వచ్చిన మనీ మైండెడ్ గర్ల్ ఫ్రెండ్ అనే షార్ట్ ఫిలిమ్ తో నటిగా అరంగేట్రం చేసిన ఈమె.. అప్పటి నుండి పలు షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలతో సందడి చేస్తోంది. ఇక అమరావతికి ఆహ్వానం, లేచింది మహిళా లోకం వంటి చెప్పుకోదగ్గ ప్రాజెక్టులతో చలనచిత్ర ప్రస్థానం రూపుదిద్దుకుంటుంది.. ఏది ఏమైనా వరుసగా అవకాశాలు అందుకోకపోయినా.. ఆచితూచి మంచి ప్రాజెక్ట్లను ఎంపిక చేసుకుంటూ నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.