వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు
కొందరు నటులు అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంటారు. వారు చేసే వ్యాఖ్యలే వారిని ఆ వివాదాల్లోకి తోస్తాయి.;
కొందరు నటులు అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంటారు. వారు చేసే వ్యాఖ్యలే వారిని ఆ వివాదాల్లోకి తోస్తాయి. తాజాగా అలాంటి కామెంట్స్ చేసే బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి వివాదంలో చిక్కుకున్నారు. భార్యాభర్తల మధ్య బాధ్యతల గురించి ఆయన రీసెంట్ గా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి. సునీల్ శెట్టి అభిప్రాయంతో ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
భార్య పిల్లల బాధ్యతని చూసుకోవాలి
అభివృద్ధి చెందుతున్న జెనరేషన్ లో ప్రస్తుతం యూత్ లో ఓపిక ఉండటం లేదని, పెళ్లైన తర్వాత భార్యాభర్తలిద్దరూ కొన్ని విషయాల్లో రాజీ పడాలని, ఎల్లప్పుడూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని, లైఫ్ లోకి పిల్లలు వచ్చాక వారి ఆలనాపాలనను భార్య తీసుకోవాలని, అప్పుడే భర్త తన కెరీర్ పై ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుందని సునీల్ శెట్టి కామెంట్స్ చేశారు.
వివాదాస్పదంగా మారిన సునీల్ శెట్టి వ్యాఖ్యలు
భార్యతో పాటూ భర్త కూడా ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని, కానీ ఈ కాలంలో అందరూ అన్ని విషయాల్లోనూ ఎంతో ప్రెజర్ ను తీసుకుంటున్నారని ఆయన అన్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన కామెంట్స్ పై ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతూ ఆ వ్యాఖ్యలను వివాదాస్పదం చేశారు.
ఈ విషయంలో కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఆయన ఇకనైనా మాట్లాడటం, స్టేట్‌మెంట్స్ ఇవ్వడం మానేయాలని అంటే, ఇంకొందరు ఇలాంటి వ్యాఖ్యలతో అతని స్థాయిని తనే తగ్గించుకుంటున్నాడని అంటున్నారు. ఇంకొందరైతే కొన్నిసార్లు మౌనంగా ఉండటం మంచిదని కామెంట్స్ చేస్తున్నారు. సునీల్ శెట్టి చేస్తున్న కామెంట్స్ పురుషాధిక్య అహంకారానికి అద్దం పట్టేలా ఉన్నాయని, ఇలాంటి విషయాల్లో ఆయన మాట్లాడటం మానేయాలని అంటున్నారు.