పుష్ప రాజ్ ని కాపీ కొడుతున్న సుధీర్..?
సుడిగాలి సుధీర్ పరిచయం అవసరం లేని వ్యక్తి. జబర్దస్త్ తో పాపులర్ అయిన అతను ఆ నెక్స్ట్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ వచ్చాడు.;
సుడిగాలి సుధీర్ పరిచయం అవసరం లేని వ్యక్తి. జబర్దస్త్ తో పాపులర్ అయిన అతను ఆ నెక్స్ట్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత హీరో అవ్వాలనుకున్న తన కలని నిజం చేసుకున్నాడు. సాఫ్ట్ వేర్ సుధీర్, వాంటెడ్ పండుగాడు, గాలోడు, కాలింగ్ సహస్ర సినిమాలు చేశాడు సుధీర్. ఐతే వీటిలో గాలోడు సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది కానీ మిగతా సినిమాలేవి పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఐతే ఈమధ్య సుధీర్ కాస్త గ్యాప్ తీసుకుని ఈసారి ఒక భారీ సినిమాతో వస్తున్నాడు. సుధీర్ ఐదవ సినిమాగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది.
గంగమ్మ తల్లి పాదాన్ని..
ఈ సినిమాను ప్రముఖ సినీ పి.ఆర్.ఓ శివ చెర్రి నిర్మిస్తున్నాడు. ఐతే సుధీర్ ఈసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో గంగమ్మ తల్లి పాదాన్ని చూపించారు. హైలెస్సో టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో సుధీర్ గంగమ్మ తల్లి గెటప్ లో కనిపించే ఛాన్స్ లు ఉన్నాయని అర్ధమవుతుంది. ఐతే లాస్ట్ ఇయర్ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ అలానే గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ లో గంగమ్మ తల్లి గెటప్ లో కనిపించాడు.
ఆ సీన్ సినిమాకే ఎంతో హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు హైలెస్సో సినిమాలో కూడా సుధీర్ అమ్మ వారి వేషం వేస్తాడని తెలుస్తుంది. ఐతే అల్లు అర్జున్ ని కాపీ కొడుతున్నాడా లేదా సుధీర్ వెరైటీగా ఏదైనా ట్రై చేస్తున్నాడా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది. సుధీర్ ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
మైథాలజీ, డివోషనల్ టచ్..
హైలెస్సో సినిమా మోషన్ పోస్టర్ తోనే ఒక వైబ్ ఇచ్చారు. సుధీర్ కి ఈ సినిమా ఒక మంచి కంబ్యాక్ ఇస్తే మాత్రం క్రేజీగా ఉంటుందని చెప్పొచ్చు. ఈమధ్య సినిమాల్లో మైథాలజీ, డివోషనల్ టచ్ ఎక్కువ అవుతుంది. ఈ క్రమంలో సుధీర్ కూడా ట్రెండ్ ని ఫాలో అవుతూ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. సుధీర్ హైలెస్సో అనౌన్స్ మెంట్ వచ్చింది కానీ డైరెక్టర్ ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు.
పోస్టర్ వచ్చినప్పటి నుంచి సుధీర్ హైలెస్సో సినిమాపై సోషల్ మీడియాలో చర్చలు నడుస్తుంది. హైలెస్సో మోషన్ పోస్టర్ చూస్తే మాత్రం అల్లు అర్జున్ పుష్ప రాజ్ ని తలపించేలా ఉంది. మరి కాపీ అనే డౌట్ రాకుండా మేకర్స్ సుధీర్ సినిమాను ఎలా డిజైన్ చేస్తారన్నది చూడాలి.