సక్సెస్ అవ్వాల్సిన స్టార్ వారసులు వీళ్లే!
పరిశ్రమకు వచ్చి సంవత్సరాలు గుడుస్తున్నా? ఇంకా సరైన బ్లాక్ బస్టర్ లేని స్టార్లగానే మిగిలిపోయారు.;
ఇండస్ట్రీలో సక్సస్ అవ్వాల్సిన స్టార్లు ప్రముఖంగా ముగ్గురు ఉన్నారు. నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నా? అవి ఫలించడం లేదు. కొన్ని సినిమాలు యావరేజ్ గా ఆడగా..మరికొన్ని చిత్రాలు డిజాస్టర్లగా నిరుత్సాహ పరుస్తున్నాయి.
పరిశ్రమకు వచ్చి సంవత్సరాలు గుడుస్తున్నా? ఇంకా సరైన బ్లాక్ బస్టర్ లేని స్టార్లగానే మిగిలిపోయారు. ఇంతకీ ఎవరా ముగ్గురు అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. అక్కినేని వారసత్వంతో అఖిల్ ఏ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చాడో తెలిసిందే. `అఖిల్` తర్వాత నాలుగైదు సినిమాల్లో నటించాడు. వాటిలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` ఒక్కటే ఆడింది.
ఇక్కడ కలిసి రాని హిట్:
అదీ అక్కినేని రేంజ్ హిట్ కాదు. అటుపై నటించిన `ఏజెంట్` డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో గ్రాండ్ విక్టరీ అందుకుంటాడని చాలా అంచనాలు ఏర్పడ్డాయి కానీ ఫలితం పూర్తిగా తారుమారు అయింది. ప్రస్తుతం `లెనిన్` లో నటిస్తున్నాడు. ఈ సినిమాపై సరైన బజ్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రమిది. అలాగే చియాన్ విక్రమ్ తనయుడు కూడా `ఆదిత్య వర్మ`తో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అటుపై `వర్మ`, `మహాన్` లాంటి చిత్రాలు చేసాడు. ఇటీవలే `బైసన్` తో కోలీవుడ్ లో హిట్ అందుకున్నాడు.
బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూపు:
తెలుగులో కూడా అనువాదమైంది. కానీ ఇక్కడ ఆడియన్స్ కు `బైసన్` కనెక్ట్ కాలేదు. అలాగే మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ లాల్ కూడా ఇంకా వెనుకబడే ఉన్నాడు. `ఆది` అనే సినిమాతో మాలవుడ్ లో లాంచ్ అయ్యాడు. అటుపై `హృదయం` సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. కానీ బ్లాక్ బస్టర్ మాత్రం ఇంకా పడలేదు. దీంతో అతడు సరైన హిట్ కోసం ఎదురు చూస్తోన్న వారసుడిగా కనిపిస్తున్నాడు. ఈ ముగ్గురు పెద్ద స్టార్ల కొడుకులు కావడంతో వాళ్లపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది.
ఇదే పరంపర ఇంకెంత కాలం:
అఖిల్ నాగార్జున తనయుడు కాగా, ధృవ్ విలక్షణ నటుడు విక్రమ్ తనయుడు, కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ లాల్. ఈ ముగ్గురి సక్సస్ అన్నది ఇండస్ట్రీకి అత్యంత కీలకం. ఇప్పటికే స్టార్ హీరోలగా సత్తా చాటాలి. కానీ ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో రేసులో మరింత వెనుకబడుతున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తోన్న నటులు స్టార్లగా ఎదుగుతున్నారు. వందల కోట్లు వసూళ్లు సాధిస్తున్నారు. కానీ అన్ని ఉన్నా? సరైన బ్లాక్ బస్టర్ మాత్రం ముగ్గురికీ ఇంకా సాధ్యం కాలేదు. ఇదే పరం పర మరికొంత కాలం కొనసాగితే ఆడియన్స్ లో చర్చకు కూడా రాని హీరోలగా మిగిలిపోతారనే ప్రచారం జరుగుతోంది.