ఒప్పందం కుదిరింది.. SSMB 29 బాధ్యత వారిదే!!

SSMB 29.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ ప్రాజెక్టు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.;

Update: 2025-09-20 10:25 GMT

SSMB 29.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ ప్రాజెక్టు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా, ఒక్క లీక్ రాకుండా, సైలెంట్ గా పని కానిస్తున్నారు జక్కన్న. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ అయినా.. గుట్టుచప్పుడు కాకుండా ముందుకెళ్తున్నారు.

కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. జక్కన్న అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. సోషల్ మీడియాలో అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా కెన్యా షెడ్యూల్ పూర్తి చేసిన రాజమౌళి.. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో కాశీ సెట్ లో చిత్రీకరణను నిర్వహిస్తున్నారు.

సినిమాకు రాజమౌళి కాస్త డివోషనల్ టచ్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్ సహా మెయిన్ క్యాస్టింగ్ అంతా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొంటున్నారని సమాచారం. కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారని వినికిడి. అక్టోబర్ 10వ తేదీ వరకు షెడ్యూల్ కొనసాగనుంది. అయితే ఇప్పుడు కీలక అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది.

హాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ వార్నర్ బ్రోస్ తో రాజమౌళి జతకట్టనున్నట్లు కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. భారత్ మినహా మిగతా దేశాల్లో వారే SSMB 29 మూవీని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల వార్నర్ బ్రోస్ సంస్థతో రాజమౌళి చర్చలు జరిపారని, సుముఖత వ్యక్తం చేశారని టాక్ వచ్చింది.

ఇప్పుడు SSMB 29 మేకర్స్, వార్నర్ బ్రోస్ సంస్ధ మధ్య ఒప్పందం కుదిరినట్లు తాజాగా తెలుస్తోంది. గ్లోబల్‌ రేంజ్ లో సినిమాను అందరికీ చేరువ చేయాలనే టార్గెట్ తో రాజమౌళి ఆ కీలక నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక సినిమా విషయానికొస్తే, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో మహేష్ బాబుతో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. తమిళ స్టార్ ఆర్. మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వినికిడి. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News