• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వాటితోనే సరిపెడుతున్న...

వాటితోనే సరిపెడుతున్న సుందరాంగి..!

| లేటెస్ట్ గా అమ్మడు బ్లాక్ కలర్ షర్ట్ తో లూజ్ హెయిర్ తో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది శ్రీనిధి.

By - Tupaki Desk
Update: 2024-07-11 07:25 GMT

మోడల్ గా తన బ్యూటీ నెస్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది శ్రీనిధి శెట్టి. తొలి సినిమా K.G.F లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించింది. ఆ సినిమా రెండు భాగాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఆ సినిమా తర్వాత చియాన్ విక్రం తో కోబ్రా సినిమాలో నటించింది. ఐతే ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో అమ్మడికి పెద్దగా ఛాన్సులు రాలేదు.

 

ఐతే సినీ కెరీర్ ఎలా ఉన్నా ఫోటో షూట్స్ తో మాత్రం శ్రీనిధి అదరగొట్టేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు బ్లాక్ కలర్ షర్ట్ తో లూజ్ హెయిర్ తో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. క్రేజ్ సంపాదించాలంటే సినిమాలే చేయనవసరం లేదు ఇలా ఫోటో షూట్స్ కూడా చేయొచ్చు అని శ్రీనిధి చెబుతుంది. ప్రస్తుతం అమ్మడికి 5 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వారందరికీ తన ఫోటో షూట్స్ తో మంచి ట్రీట్ ఇస్తుంది అమ్మడు.

 

KGF తర్వాత తెలుగు నుంచి ఆఫర్లు వచ్చినా అప్పుడు చేయనని చెప్పిన శ్రీనిధి ప్రస్తుతం తెలుగులోనే సినిమా ఆఫర్ అందుకుంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న తెలుసు కదా సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది శ్రీనిధి శెట్టి. ఐతే ఈ సినిమాలో శ్రీనిధితో పాటు రాశి ఖన్నా కూడా నటిస్తుంది. ఇక లేటెస్ట్ గా అమ్మడు న్యాచురల్ స్టార్ నాని చేస్తున్న హిట్ 3 లో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ సినిమాలు విశ్వక్ సేన్, అడవి శేష్ లు చేశారు. ఇప్పుడు హిట్ 3 ని నాని చేస్తున్నాడు. ఈ సినిమాలకు నాని నిర్మాత అని తెలిసిందే. హిట్ 3 లో శ్రీనిధి హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ అందుకుందని టాక్.

 

కథలు నచ్చక చేయట్లేదా లేదా తను అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వట్లేదని ఆఫర్లు రావట్లేదా కానీ శ్రీనిధి సినీ కెరీర్ మాత్రం చాలా వెనుకపడింది. ఎంత గ్లామర్ షో చేసినా సినిమాల్లో పాత్రలతో ప్రేక్షకులను అలరించాల్సిందే. ఐతే వచ్చిన ప్రతి అవకాశం చేయాల్సిన పనిలేదు కానీ కెరీర్ గ్రాఫ్ పెంచుకునే క్రమంలో కచ్చితంగా కొన్ని కథలను ఓకే చేయాల్సి ఉంటుంది. మరి శ్రీనిధి ఇక మీదట తన సినిమాల వేగం పెంచి వరుస ప్రాజెక్ట్ లు చేస్తే సినిమాల క్రేజ్ కూడా తోడై సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

లుక్స్ పరంగా చూస్తే ఒక స్టార్ హీరోయిన్ కు ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. ఐనా కూడా శ్రీనిధి ఎందుకు ఛాన్సులు అందుకోలేకపోతుందని ఆమె ఫాలోవర్స్ ఫీల్ అవుతున్నారు. స్టోరీ సెలక్షన్ లో శ్రీనిధి ఆలోచన మారి వరుస సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

Tags:    
  • Srinidhishetty 
  • Phototalk 
  • Kgfactress 
  • Latestclicks 
  • Siddujonnalagadda 
  • Telsukadhamovie 
  • Glamourshow 
  • Raashikhanna 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS