సూపర్ హిట్ సీక్వెల్.. డబుల్ ఫన్ బొనాంజా..!

యువ హీరోల్లో శ్రీవిష్ణు సినిమాలు చాలా స్పెషల్ గా ఉంటాయి. రెండేళ్ల క్రితం వచ్చిన సామజవరగన సినిమా శ్రీవిష్ణుకి సూపర్ హిట్ ఇచ్చింది.;

Update: 2025-09-09 15:30 GMT

యువ హీరోల్లో శ్రీవిష్ణు సినిమాలు చాలా స్పెషల్ గా ఉంటాయి. రెండేళ్ల క్రితం వచ్చిన సామజవరగన సినిమా శ్రీవిష్ణుకి సూపర్ హిట్ ఇచ్చింది. రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు భాను, నందు రైటర్స్ గా పనిచేశారు. ఇప్పుడు భాను కూడా డైరెక్టర్ గా మారి మాస్ మహారాజ్ రవితేజతో సినిమా చేస్తున్నాడు. రామ్ అబ్బరాజు కూడా శర్వానంద్ తో నారి నారి నడుమ మురారి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా దాదాపు ముగింపు దశకు వచ్చింది.

సామజవరగమన సీక్వెల్ గా..

ఐతే ఆ సినిమా తర్వాత రాం అబ్బరాజు మరోసారి శ్రీవిష్ణుతో సినిమా చేస్తాడని టాక్. అంతేకాదు ఇద్దరు కలిసి చేసిన సామజవరగమన సీక్వెల్ గా ఈ ప్రాజెక్ట్ వస్తుందట. ఈమధ్యనే రాం అబ్బరాజు చెప్పిన కథకు శ్రీవిష్ణు ఎగ్జైట్ అయ్యాడట. సో త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని టాక్. రాం అబ్బరాజు శ్రీవిష్ణు కాంబో అనగానే గుర్తొచ్చే సామజవరగమన సీక్వెల్ గానే ఈ మూవీ వస్తుందట.

సూపర్ హిట్ సినిమా సీక్వెల్ గా ఈసారి డబుల్ ఫన్ బొనాంజా ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారట. శ్రీవిష్ణు సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాల్లా ఉంటాయి. వాటిల్లో ఎలాంటి సభ్యత లేకుండా కంప్లీట్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తాడు. అలా వచ్చిన సామజవరగమన సినిమా ఎంతో పుష్ ఇచ్చింది. ఈమధ్యనే శ్రీవిష్ణు సింగిల్ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు.

శ్రీ విష్ణు మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్..

సో ఈసారి సామజవరగమన 2 మరింత ఫన్ ఉండబోతుందని చెప్పొచ్చు. మాక్సిమం సామజవరగమన సినిమాలో కాస్టింగ్ నే ఈ సీక్వెల్ లో కూడా రిపీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. సో శ్రీవిష్ణు నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ డబుల్ డోస్ అంటే ఈసారి మళ్లీ కడుపుబ్బా నవ్వుకునేందుకు ఆడియన్స్ సిద్ధం అవ్వాల్సిందే. శ్రీవిష్ణు ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే రామ్ అబ్బరాజుతో ఈ మూవీ మొదలు పెడతాడు.

స్టార్ సినిమాలు ఎలాగు భారీ బడ్జెట్ తో విజువల్ ట్రీట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఐతే మరికొందరు వేరు వేరు జోనర్లలో ప్రయోగాలు చేస్తుంటారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని వెరైటీ కథలు చేస్తూ మరోపక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తుంటాడు శ్రీవిష్ణు. ఈ క్రమంలో వస్తున్న సినిమాలు అతనికి మంచి సక్సెస్ లు అందిస్తున్నాయి. సో సామజవరగమన 2 కూడా ఆ హిట్ ఖాతాలో పడుతుందా లేదా అన్నది సినిమా వస్తేనే చెప్పగలం.

Tags:    

Similar News