శ్రీలీల కఠిన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాల్లో చూడలేమా?

ఇకపోతే శ్రీ లీల తాను నటించిన చిత్రాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా ఆ చిత్రాలలో స్పెషల్ సాంగ్ లు చేసి తన మాస్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.;

Update: 2026-01-07 15:27 GMT

ప్రముఖ యంగ్ బ్యూటీ శ్రీ లీలా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందం, అభినయంతో ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈమధ్యకాలంలో భాషతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రం పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే పలు ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టిన శ్రీలీల.. తాజాగా తాను తీసుకున్న కఠిన నిర్ణయం గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

ప్రమోషన్స్ లో భాగంగా గతంలో ఈమె పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంపై ప్రశ్న ఎదురవగా.. ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. "నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే నేను నటించే సినిమాలలో మాత్రమే స్పెషల్ సాంగ్ చేయాలనుకున్నాను. కానీ పుష్ప2 సినిమాలో తప్పని పరిస్థితుల్లో ఓకే చెప్పాను. ఇది చాలా కఠిన నిర్ణయం అయినా.. ఈ సినిమా నాకు ఊహించని ఇమేజ్ ను అందించింది. కాబట్టి ఈ పాట చేయడం మంచి నిర్ణయమే అనిపించింది. అయితే ఇకపై నా సినిమాలలో తప్ప ఇతర హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది శ్రీ లీల. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే శ్రీ లీల తాను నటించిన చిత్రాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా ఆ చిత్రాలలో స్పెషల్ సాంగ్ లు చేసి తన మాస్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీ లీల.. ఆ తర్వాత రవితేజతో ధమాకా సినిమా చేసి భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా ఇందులో ఈమె చేసిన స్పెషల్ సాంగ్ మరింత పాపులారిటీని అందించిందని చెప్పవచ్చు. ఇక అలాగే మహేష్ బాబు. త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో "కుర్చీ మడత పెట్టి" అనే పాటలో ఏ రేంజ్లో పర్ఫామెన్స్ ఇచ్చిందో ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేక పోతున్నారు. అలా తను హీరోయిన్గా నటించే ప్రతి సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె ఇకపై కూడా అలాగే చేస్తానని.. పైగా వేరే సినిమాలలో స్పెషల్ సాంగ్ చేయనని చెప్పుకొచ్చింది.

శ్రీ లీల నటించే చిత్రాలలో నిర్మాతలకు పెద్ద ఊరట అని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఒక సినిమాలో ఒక హీరోయిన్ చేస్తోంది అంటే ఆమె కేవలం హీరోయిన్ పాత్రకే పరిమితం అవుతుంది. స్పెషల్ సాంగ్ ఉందంటే వేరే హీరోయిన్ ను సంప్రదించాల్సి ఉంటుంది. కానీ శ్రీలీలా చేసే సినిమాలకు మాత్రం ఆ తలనొప్పి ఉండదు. పైగా నిర్మాతలకు ఖర్చు ఉండదు. అలా మొత్తానికైతే నిర్మాతల మనిషిగా మరింత పేరు సొంతం చేసుకుంది శ్రీ లీల.

Tags:    

Similar News