ఇన్ స్టంట్ హిట్.. ఇదే కొత్త ట్రెండ్..!
నేడు శ్రీమణి పుట్టినరోజు ఈ సందర్భంగా మీడియాతో స్పెషల్ చిట్ చాట్ చేశారు శ్రీమణి. ఆ విశేషాలేంటో చూద్దాం.;
ఒక సినిమా రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేందుకు వదిలే సాంగ్, టీజర్ చాలా ప్రాముఖ్యత ఏర్పరచుకుంటాయి. ముఖ్యంగా ఒక్క సాంగ్ తో సినిమాపై అంచనాలు పెంచినవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రెండ్ లో ఉన్నా కాబట్టి సాంగ్ ఇన్ స్టంట్ హిట్ అయితేనే బాగుంటుంది. ఐతే అలాంటి పాటలతో పాటు ఆబాల గోపాలాన్ని అలరించే పాటలతో తన రచనను కొనసాగిస్తున్నారు ప్రముఖ గేయ రచయిత శ్రీమణి.
100 పర్సెంట్ లవ్ తో లిరిక్ రైటర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన శ్రీమణి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నారు. టాలీవుడ్ టాప్ లిరిస్ట్ లల్లో ఒకరిగా సినిమాకు కావాల్సిన ఎలాంటి పాటనైనా అందించే రైటర్ గా క్రేజ్ తెచ్చుకున్నారు శ్రీమణి. నేడు శ్రీమణి పుట్టినరోజు ఈ సందర్భంగా మీడియాతో స్పెషల్ చిట్ చాట్ చేశారు శ్రీమణి. ఆ విశేషాలేంటో చూద్దాం.
ప్రత్యేకత ఏమైనా ఉందా..?
ప్రత్యేకత లేదు కానీ ఈ సాహిత్యపు జర్నీలో మరో మెట్టు ఎక్కాలని.. కొత్త అచీవ్ మెంట్ లు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నా అన్నారు. ఈరోజే నా లైఫ్ మొదలైంది అనే భావనతో కొత్త పనులు చేయాలి. అవి బర్త్ డే రోజే ఆరంభం కావలని కోరుకుంటా అన్నారు శ్రీమణి.
ఈ ఏడాది మీకు సంతృప్తి ఇచ్చిన పాటలు..?
సాహిత్యం పరంగా లోతైన సన్నివేశాలకు సాంగ్స్ ఇచ్చే అవకాశం వచ్చింది. తండేల్ లో బుజ్జి తల్లి, హైలెస్సా సాంగ్స్ తో పాటు లక్కీ భాస్కర్ లో నిజమా కలా, ఆయ్ మూవీలో పాటలు మంచి పేరు తెచ్చాయని అన్నారు శ్రీమణి. కథలో ఉన్న సన్నివేశం తాలూకా లోతైన భావం చెప్పడమే ఈ పాటలు రాశాను. ఐతే ఈ పాటలను నేను రాయగలనని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకులకు కృతజ్ఞతలు చెప్పారు శ్రీమణి.
సాహిత్యం పరంగా వస్తున్న మార్పులకు ఎలా అప్డేట్ చేసుకుంటున్నారు..?
ప్రతి పాటకు ఒక ఛాలెంజ్ ఉంటుంది. లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కాలంలో సంగీతంతో పాటు లిరిక్స్ సౌడ్ డిజైనింగ్ మారింది. అందుకే నేను ట్రెండ్ కు తగినట్టుగా స్టాండర్డ్స్ మిస్ అవ్వకుండా పాటకు కాలపరిమితి లేకుండా అంటే పదేళ్ల తర్వాత కూడా లిరిక్స్ ఫ్రెష్ గా అనిపించేలా ప్రయత్నిస్తా అన్నారు.
ప్రేమ పాటలు ఎక్కువగా రాయడానికి కారణం..?
ప్రేమ అనేది యూనివర్సల్.. ప్రతి పాటలో, భావంలో కొత్తదనం దొరుకుతుంది. కొత్త ఎక్స్ ప్రెషన్ ఉంటుంది. సున్నితమైన పదాల్లో అందరికీ అర్ధమయ్యేలా ఎమోషన్ మిస్ అవ్వకుండా పాట రాయడం.. శబ్ధంలో అర్ధం ఉండేలా చూసుకుంటూ ఉంటానన్నారు శ్రీమణి.
రాసిన పాటల్లో ఫేవరెట్ సాంగ్..?
అన్ని పాటలు ఇష్టపడతాను. రాసిన ప్రతి పాట నాకు ఫేవరెట్టె.. రైటర్ ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి.. ఇంకా రాయాలి.. కొత్త లిరిక్స్ అందించాలని కోరుకుంటానన్నారు.
సోషల్ మీడియా ట్రెండ్ లో పాట ఇన్ స్టంట్ హిట్ అవుతుంది.. ఆ టార్గెట్ ఎలా ఉంటుంది..?
ఇది రైటర్స్ కి కత్తి మీద సాములాంటిది. ఇదివరకు పాట రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టేది. కానీ సోషల్ మీడియా వల్ల వినగానే నచ్చేయాలి అనే భావమ ఉంది. అందుకు తగినట్టుగానే ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్స్ ఆ నిలుస్తున్నాయి. ఐతే ఇదే సాంగ్ పదేళ్ల తర్వాత కూడా అదే సేం ఫీలింగ్ ఉండాలి అనే భావనతో అందరం పాటలు రాస్తున్నామని అన్నారు శ్రీమణి.
మీరు ఏ తరహా పాటలు రాయడం అవకాశాలు వస్తాయి.. కథ మొత్తం విని పాటలు రాస్తారా..?
ఆరడుగుల బుల్లెట్ సాంగ్ విని హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ రాసే అవకాశాలు చాలా వచ్చాయి. ఎక్కడ ఎక్కడ సాంగ్ తర్వాత ప్రేమ పాటలు వచ్చాయి. మహర్షిలో ఇదే కద సాంగ్ మాత్రం కథ విని రాశా. కొన్ని సాంగ్స్ సిట్యువేషన్ ను బట్టి రాస్తానన్నారు శ్రీమణి.
గర్వపడిన పాట అంటే ఏం చెబుతారు..?
నేను గర్వపడే పాట నేను నిర్ణయించలేను.. మనం రాసిన పాట మనం గౌరవించే వ్యక్తులు గొప్పగా చెప్పినప్పుడు ఆ సంతృప్తి వస్తుంది. నన్ను లిరిక్ రైటర్ గా పరిచయం చేసిన సుకుమార్ గీతా గోవిందంలో వచ్చిందమ్మా పాట గురించి మెచ్చుకున్నారు. మహర్షి పాట విని సిరివెన్నెల గారు అభినందించారు. అలాంటి గొప్ప వ్యక్తి అభినందించడం జీవితంలో మరచిపోలేను.. అలాంటి టైం లో గొప్ప పాట రాశాననే భావన వస్తుందని అన్నారు.
డైరెక్షన్ వైపు వెళ్లే ఆలోచన ఉందా..?
డైరెక్షన్ ఆలోచన లేదు. కానీ పరిపూర్ణ రైటర్ గా ఎదగాలి అనే కోరిక ఉంది. మిత్రులతో కలిసి కథా చర్చల్లో పాల్గొనే వాడిని. లిరిక్స్ తో పాటు డైలాగ్స్ రాయాలని ఉంది. సాహిత్యం విలువ పెంచాలనే నా కోరిక అన్నారు శ్రీమణి.
ప్రస్తుతం మీరు అందిస్తున్న పాటలు.. సినిమాలు..?
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఓ తార సినిమాతో పాటు సాయి తేజ్ సంబరాల యేటిగట్టు, ఇండియా హౌస్ సినిమాలకు సాహిత్యం అందిస్తున్నా అన్నారు శ్రీమణి.