• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజ్జి.. అమ్ము.. ఈ...

విజ్జి.. అమ్ము.. ఈ సెంటిమెంట్ కలిసొచ్చేలా ఉందే..!

| శ్రీ లీల పాత్ర పేరు పాపులర్ అయితే ఆ సినిమా హిట్టే అన్న సెంటిమెంట్ ఏర్పడితే మాత్రం ఇక నుంచి శ్రీ లీల నటించే సినిమాల్లో అమ్మడి పాత్ర పేరు రకరకాలుగా పెట్టే అవకాశం ఉంది.

By - Tupaki Desk
Update: 2024-01-11 09:21 GMT

హిట్ సినిమాకు సెంటిమెంట్లు ఎన్నో అన్నట్టుగా కొన్ని సినిమల్లో కొందరి పాత్రలు.. పాత్రల పేర్లు బాగా రిజిస్టర్ అవుతాయి. సినిమా టైటిల్ కన్నా ఆ సినిమాలోని పాత్రల పేర్లు బాగా పాపులర్ అవుతాయి. అలా పాపులర్ అయిన పేర్లని సినిమా టైటిల్స్ గా కూడా వాడేస్తుంటారు. అయితే ఒక సినిమా హిట్ అయినందుకు కారణాలు ఏవైనా ఆ సినిమాలో హీరో హీరోయిన్ పాత్రల పేర్లకు కూడా సెంటిమెంట్ అంటించేస్తారు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా సినిమాలో అమ్మడి పేరు అమ్ము అని తెలుస్తుంది. ఆల్రెడీ బాలకృష్ణతో శ్రీ లీల కలిసి నటించిన భగవంత్ కేసరి సినిమాలో శ్రీ లీల పేరు విజయలక్ష్మి అని పెట్టారు. సినిమాలో ఆమెను ఎక్కువగా విజ్జి అని పిలుస్తారు. ఆ విజ్జి పాత్రలో అదరగొట్టిన శ్రీ లీల సినిమా హిట్ లో భాగమైంది. ఇక ఇప్పుడు రాబోతున్న గుంటూరు కారం సినిమాలో కూడా శ్రీ లీల అమ్ము పాత్రలో నటిస్తుంది.

సినిమా సెంటిమెంట్ ప్రకారం విజ్జి పాత్రతో ఎలాగైతే శ్రీ లీల అలరించిందో అమ్ము పాత్రలో కూడా శ్రీ లీల అదే రేంజ్ లో ఆకట్టుకుంటుందని అంటున్నారు. శ్రీ లీల పాత్ర పేరు పాపులర్ అయితే ఆ సినిమా హిట్టే అన్న సెంటిమెంట్ ఏర్పడితే మాత్రం ఇక నుంచి శ్రీ లీల నటించే సినిమాల్లో అమ్మడి పాత్ర పేరు రకరకాలుగా పెట్టే అవకాశం ఉంది.

గుంటూరు కారం సినిమాలో శ్రీ లీలతో పాటుగా మీనాక్షి చౌదరి కూడా మరో హీరోయిన్ గా నటించింది. సినిమాలో శ్రీ లీల డ్యాన్స్ మూమెంట్స్ ఆడియన్స్ ని థ్రిల్ అయ్యేలా చేస్తాయని అంటున్నారు. కుర్చీ మడతపెట్టి సాంగ్ లో శ్రీ లీల స్టెప్పులు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. మొత్తానికి మొన్న విజ్జీగా భగవంత్ కేసరిలో అలరించిన శ్రీ లీల అమ్ముగా గుంటూరు కారం లో అదరగొట్టేందుకు సిద్ధమైంది. ఈ ఇయర్ గుంటూరు కారం తో హిట్ ఖాతా తెరవాలని చూస్తున్న శ్రీ లీల పవన్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లేట్ అయ్యేలా ఉన్న కారణంగా నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ చేస్తుంది అమ్మడు.

Tags:    
  • Tollywood 
  • Gunturkaram 
  • Sreeleela 
  • Actresssreeleela 
  • Bhagavanthkesari 
  • Ammu 
  • Name 
  • Sentiment 
  • Trivikram 
  • Meenakshichaudhary 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS