• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోలు మాత్రమే మారేది.....

హీరోలు మాత్రమే మారేది.. శ్రీలీల కామన్..!

| సెప్టెంబర్ తో మొదలుపెట్టి, మళ్లీ వచ్చే ఏడాది జనవరి వరకు శ్రీలీల సినిమాలే రానున్నాయి. అన్ని సినిమాలు ఒక్కో పండగను టార్గెట్ చేసుకొని వస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2023-08-19 18:46 GMT

హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే, తమకు క్రేజ్ ఉన్న సమయంలోనే ఎక్కువ సినిమాలు ఒకే చేస్తారు. కొందరు అయితే, కనీసం మూవీ స్టోరీలు కూడా పట్టించుకోరు. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అన్న చందంలో వీలైనన్ని సినిమాలు చేసి డబ్బు సంపాదించుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్ శ్రీలీల కూడా అదే చేస్తోంది.

తన దగ్గరకు వచ్చిన దాదాపు అన్ని ఆఫర్లు ఒకే చేస్తోంది. ఇప్పుడు ఆమె చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు విడుదలకు సిద్ధమౌతున్నాయి. నెల నెల గ్యాప్ లో ఐదు సినిమాలు విడుదల తేదీని లాక్ చేసేసుకున్నాయి. కేవలం, ఐదు నెలల్లో, ఐదు సినిమాలు విడుదలౌతున్నాయి.

సెప్టెంబర్ తో మొదలుపెట్టి, మళ్లీ వచ్చే ఏడాది జనవరి వరకు శ్రీలీల సినిమాలే రానున్నాయి. అన్ని సినిమాలు ఒక్కో పండగను టార్గెట్ చేసుకొని వస్తున్నాయి. అయితే, పండగ మారుతోంది, హీరో మారుతున్నాడు. కానీ హీరోయిన్ మాత్రం శ్రీలీలే ఉంటుంది. సెప్టెంబర్ లో రామ్ తో కలిసి నటించిన స్కందతో టాలీవుడ్ పై వార్ కి రెడీ అవుతోంది ఈ హాట్ అండ్ క్యూట్ బ్యూటీ.

ఈ సినిమా వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో రామ్ ఎనర్జీకి సూటయ్యేలా శ్రీలీల స్టెప్పులు ఉంటాయని, ఇప్పటికే విడుదలైన పాటల ద్వారా అర్థమైపోయింది. దాని తర్వాత అక్టోబర్ నెలలో బాలయ్య భగవంత్ కేసరి రాబోతోంది. దరసరా కానుకగా అక్టోబర్ 19 న దీనిని విడుదల చేస్తున్నారు. ఇందులోనూ ప్రధాన పాత్రలో శ్రీలీల నటించడం విశేషం.

ఇక, నవంబర్ లో యుంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించి ఆదికేశవ విడుదలకు రెడీ అవుతోంది.దీపావళి సందర్భంగా ఈ మూవీని నవంబర్ 10న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. , ఆ తర్వాత డిసెంబర్ లో నితిన్‌తో కలిసి రాబోతుంది. ఆయన హీరోగా రూపొందిన 'ఎక్ట్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌' చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. క్రిస్మస్, న్యూయర్ కి ముందుగానే ఈ మూవీ వస్తోంది. చివరగా, వచ్చే ఏడాది శుభారంభం జనవరిలో సంక్రాంతి పండగ సందర్భంగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఐదు నెలల్లో ఐదు సినిమాలతో సందడి చేయడానికి రెడీ అయ్యింది. వీటిలో ఎన్ని హిట్ అవుతాయో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Movies 
  • Heros 
  • Sreeleela 
  • Actress 
  • Skanda 
  • Bhagavanthkesari 
  • Aadikeshava 
  • Extraoridinaryman 
  • Gunturkaram 
  • Lineup 
  • Maheshbabu 
  • Balakirshna 
  • Nithin 
  • Vaishnavtej 
  • Ram 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS