ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ల్ల శ్రీలీల‌కు ఇన్ని క‌ష్టాలొచ్చాయా ?

నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా పవన్ పొలిటికల్ జర్నీ వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఇప్పుడు సెట్స్ మీదకు వచ్చి జూన్ నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు.;

Update: 2025-05-31 21:30 GMT

రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చుకున్న బ్యూటీ శ్రీలీల. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక ఆమెకు వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. రష్మిక, పూజా హెగ్డే లాంటి అప్పుడు ఫామ్ లో ఉన్న హీరోయిన్లకు సైతం శ్రీలీల‌ గట్టి ఝులక్ ఇచ్చింది. నక్క తోక తొక్కాన‌నే సంబరపడిపోయే లోపు వరుస ప్లాపులు ఆమె ఇమేజ్‌ను కాస్త డ్యామేజ్ చేశాయి. అదే టైంలో ఆమె ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ఉస్తాద్‌ భగత్ సింగ్, మహేష్ బాబు పక్కన గుంటూరు కారం సినిమాలకు సైన్ చేసింది.

ఈ రెండు సినిమాలు టాలీవుడ్ లో తన క్రేజ్‌ను అమాంతం మార్చేస్తాయని అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకుంది గుంటూరు కారం అంచనాలు అందుకోలేదు. ఇక మూడేళ్ల క్రితం సైన్‌ చేసిన ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా ఇప్పటికీ సెట్స్ మీదకు వెళ్లలేదు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ - పవన్ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్టు కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు.. టాలీవుడ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుగా వెయిట్ చేస్తున్నారు.

నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా పవన్ పొలిటికల్ జర్నీ వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఇప్పుడు సెట్స్ మీదకు వచ్చి జూన్ నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం శ్రీలీల బ‌ల్క్‌ డేట్స్ ఇచ్చింది. ఇటు పవన్ పక్కన అవకాశం వచ్చినందుకు ఆనందపడాలో.. ఈ సినిమా కోసం ఆమె క్రేజీ ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడుతూ ఉండడంతో బాధపడాలో తెలియని పరిస్థితి ఉంది. శ్రీలీల సైఫ్ ఆలీఖాన్ త‌న‌యుడు ఇబ్రహీం పక్కన నటించే సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరింది.

అయితే కార్తీక్ ఆర్య‌న్‌తో ఆషీకి 3 సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ మూవీ ఇప్పటికీ 40 % షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఉస్తాద్‌ భగత్ సింగ్‌తో కార్తీక్ ఆర్య‌న్‌ సినిమా షూటింగ్ వాయిదా పడిందని టాక్. షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో ఆ ఎఫెక్ట్ రిలీజ్ డేట్ మీద కూడా ప‌డ‌నుంది. బాలీవుడ్లో ర‌ష్మిక‌లాగా పాతుకు పోవాల‌ని ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటోన్న శ్రీలీల‌కు ఇప్పుడు ఉస్తాద్ స‌డెన్‌గా సెట్స్ మీద‌కు రావ‌డంతో ఆ ఆశ‌లు నెర‌వేరాలంటే మ‌రి కొంత కాలం వెయిట్ చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

Tags:    

Similar News