శ్రీలీల అంత ప్రీ ప్లాన్డ్‌ గా ఎవరూ లేరేమో..

సినీ ఇండస్ట్రీలో స్టార్‌ డమ్‌ వచ్చాక అవకాశాలు తగ్గిపోతే చాలామంది హీరోయిన్లు ఆందోళన చెందుతారు.

Update: 2026-07-15 14:30 GMT

సినీ ఇండస్ట్రీలో స్టార్‌ డమ్‌ వచ్చాక అవకాశాలు తగ్గిపోతే చాలామంది హీరోయిన్లు ఆందోళన చెందుతారు. కానీ శ్రీలీల మాత్రం ఆ కోవకు చెందిన హీరోయిన్‌ లా కనిపించడం లేదు. ఒకవైపు సినిమాలు, మరోవైపు స్పెషల్ సాంగ్స్, ఇంకోవైపు బ్రాండ్ ప్రమోషన్లు, షాప్ ఓపెనింగ్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్.. వీటితో పాటు మెడిసిన్ ఎడ్యుకేషన్ పై కూడా దృష్టి పెట్టడం చూసి కెరీర్‌ ను ముందుగానే ప్లాన్ చేసుకున్న హీరోయిన్ అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది.

టాలీవుడ్‌ లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌ గా ఎదిగిన వారిలో శ్రీలీల పేరు ముందుంటుంది. ధమాకా విజయంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోల సినిమాల్లో చోటు దక్కించుకుని ఒక స్టేజ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్‌ గా మారింది. ముఖ్యంగా మహేష్ బాబు వంటి స్టార్ హీరో సరసన నటించడం ద్వారా ఆమె కెరీర్ మరింత ఎత్తుకు వెళ్తుందని చాలామంది భావించారు.

అయితే ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులు కామన్. ఇటీవల ఆమె నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోవడంతో సోషల్ మీడియాలో అనేక రకాల చర్చలు మొదలయ్యాయి. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్నాయనే ప్రచారం కూడా వినిపిస్తోంది. కొందరు నెటిజన్లు ఆమె కెరీర్ మళ్లీ కొత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇక్కడే శ్రీలీల ప్రత్యేకత కనిపిస్తోందని మరికొందరు అంటున్నారు.

చాలా మంది హీరోయిన్లు పూర్తిగా సినిమాలపైనే ఆధారపడితే, శ్రీలీల మాత్రం తన ఫైనాన్సియల్ సోర్సెస్ ను పెంచుకుందనే చెప్పాలి. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ను ఉపయోగించుకుని బ్రాండ్ ఎండార్స్మెంట్లు చేస్తోంది. వివిధ సంస్థల ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటోంది. షాప్ ఓపెనింగ్స్‌, ఈవెంట్స్‌, కమర్షియల్ అసైన్మెంట్లతో ఎప్పుడూ బిజీగానే కనిపిస్తోంది. అంతేకాదు, మెడిసిన్ కోర్సు కూడా కొనసాగించాలని ఆమె తీసుకున్న నిర్ణయం ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతోంది.

సినిమాల్లో అవకాశాలు ఎప్పటికీ ఒకేలా ఉండవని తెలుసుకుని ఆల్టర్నేషన్ వేస్ పై దృష్టి పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే చాలామంది నెటిజన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె కెరీర్‌ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా, శ్రీలీల మాత్రం తన పనుల్లో బిజీగా ముందుకు సాగుతోంది. ఒక సినిమా హిట్, ఫ్లాప్‌ తోనే కెరీర్ ముగిసిపోదని గతంలో పలువురు హీరోయిన్లు నిరూపించారు. అదే విధంగా శ్రీలీల కూడా సరైన కథ, సరైన పాత్రతో మళ్లీ స్ట్రాంగ్ గా నిలబడే అవకాశాలు ఉన్నాయని అభిమానులు నమ్ముతున్నారు.

ఏదేమైనా ప్రస్తుతం అవకాశాల గురించి జరుగుతున్న చర్చల కంటే, కెరీర్‌ తో పాటు ఫ్యూచర్ ను కూడా ప్లాన్ చేసుకోవడంలో శ్రీలీల చూపిస్తున్న ప్లాన్ ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో శ్రీలీల అంత ప్రీ ప్లాన్డ్‌ గా ఎవరూ లేరేమో అనే కామెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినీ కెరీర్‌ లో ఇబ్బందులు వచ్చినా, ముందుచూపుతో అడుగులు వేస్తున్న హీరోయిన్‌ గా శ్రీలీల తనదైన గుర్తింపును కొనసాగిస్తోందని చెప్పొచ్చు.

Tags:    

Similar News