శ్రీలీల లేటెస్ట్ ట్రెడిషనల్ లుక్ వైరల్.. గ్రేస్‌తో మెస్మరైజ్

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ అండ్ ఎనర్జెటిక్ బ్యూటీ శ్రీలీల తన సరికొత్త ట్రెడిషనల్ లుక్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Update: 2026-08-19 06:09 GMT

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ అండ్ ఎనర్జెటిక్ బ్యూటీ శ్రీలీల తన సరికొత్త ట్రెడిషనల్ లుక్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. రాయల్ అండ్ ఫెస్టివ్ వైబ్‌తో పంచుకున్న ఈ ఫొటోషూట్‌లో ఆమె దేవకన్యలా మెరిసిపోతూ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. ట్రెడిషనల్ వేర్‌లో శ్రీలీల చూపించిన గ్రేస్, ఆమె అమాయకమైన చూపులు కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 




అదిరిపోయే రాయల్ డిజైనర్ లుక్:

ఈ ఫొటోషూట్‌లో శ్రీలీల క్రీమ్ అండ్ ఐవరీ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న ఎక్స్‌క్లూజివ్ సాంప్రదాయ దుస్తులను ధరించారు. ఇందులో బంగారు పూల జరీ వర్క్, పింక్ అండ్ గ్రీన్ కలర్ జియోమెట్రిక్ బోర్డర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దానికి మ్యాచింగ్ సీక్విన్ వర్క్ ఉన్న నెట్ దుపట్టా, రాయల్ జ్యువెలరీ, చోకర్, బుట్టలు మరియు పాపిడి బిళ్ళతో ఆమె మహారాణిలా కనిపిస్తున్నారు.




మనసు చెప్పినట్టే నడుచుకుంటే..:

తన లేటెస్ట్ ఫొటోషూట్ పిక్స్‌ను షేర్ చేస్తూ శ్రీలీల ఒక మంచి అర్ధవంతమైన క్యాప్షన్ జోడించారు. "“మనసు చెప్పిన బాటలో మనం ప్రయాణించినప్పుడు..” అంటూ ఆమె షేర్ చేసిన క్యాప్షన్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది.. తెల్లటి పరదాల నేపథ్యంలో ఆమె ఇచ్చిన పోజులు, చిరునవ్వులు నెటిజన్లను విపరీతంగా అలరిస్తున్నాయి.

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు:

బెంగుళూరులో పెరిగిన శ్రీలీల 2017లో 'చిత్రాంగద' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత కన్నడలో 'కిస్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, తెలుగులో 'పెళ్లి సందడి'తో ఎంట్రీ ఇచ్చారు. 'ధమాకా' చిత్రంతో మాస్ విజయాన్ని అందుకోవడమే కాకుండా సైమా అవార్డును గెలుచుకున్నారు. 'భగవంత్ కేసరి', 'గుంటూరు కారం' చిత్రాలతో పాటు 'పుష్ప 2'లో తన స్పెషల్ డ్యాన్స్‌తో దుమ్మురేపారు.

క్రేజీ ప్రాజెక్టులతో హిట్ :

ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. 'రాబిన్‌హుడ్', 'జూనియర్', రవితేజ తో మాస్ జాతర సినిమాలతో పాటు తమిళంలో 'పరాశక్తి', పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాల్లోనటించి హిట్ అందుకున్నారు.

తన అద్భుతమైన డ్యాన్స్, నటన మరియు అందంతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసిన శ్రీలీల, రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విజయాలను అందుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో మెరవాలని కోరుకుందాం.

Tags:    

Similar News