• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ పాప కూడా పారితోషకం...

ఈ పాప కూడా పారితోషకం పెంచేస్తోంది..

| పెళ్లి సందD మూవీతో తెలుగు తెరకు పరిచయం

By - Tupaki Desk
Update: 2023-07-18 06:23 GMT

పెళ్లి సందD మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది బ్యూటీ శ్రీలీల . తెలుగులో అడుగుపెట్టడానికి మందే కన్నడలో రెండు సినిమాలు చేసింది. అక్కడ కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు అందం ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టి ఆకర్షించేసింది.

సినిమా స్టోరీ పాత చింతకాయ పచ్చడిలా ఉంది కాబట్టి క్లిక్ అవ్వలేదు. కానీ, శ్రీలీల నటన, అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ధమాకా సినిమాతో రవితేజ తో జతకట్టింది. ఈ సినిమా లో ఆమె డ్యాన్స్ ఇరగదీసింది.

దీంతో, ఆమెకు వరసగా ఆఫర్లు క్యూలు కడుతున్నాయి. ఎంతలా ఉంటే, టాలీవుడ్ లో రిలీజ్ కి దగ్గరపడుతున్న ఏ సినిమా చూసినా అందులో శ్రీలీలే కనిపించడం విశేషం. రాబోయే చిత్రాల్లోనూ ఆమెనే తీసుకోవాలని మేకర్స్ చూస్తున్నారు. ఈ క్రమంలో తనకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని ఈ బ్యూటీ కూడా రెమ్యూనరేషన్ పెంచేయడం విశేషం.

ఇటీవల నితిన్ , వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి శ్రీలీలను తీసుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ మూవీ కోసం శ్రీలీల దాదాపు రూ.2కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె చేస్తున్న అన్ని సిమాలకు రూ.కోటి లోపే రెమ్యూనరేషన్ తీసుకుందట. కానీ, ఇప్పుడు డిమాండ్ పెంచినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం పదికి పైగా సినిమాల్లో నటిస్తోంది. మహేష్ గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ గా తీసుకోగా, ఇప్పుడు మొయిన్ హీరోయిన్ గా మారిపోయింది. మరోవైపు రామ్ హీరోగా, బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలోనూ హీరోయిన గా శ్రీలీలే నటిస్తోంది.

బాలకృష్ణ భగవంత్ కేసరిలోనూ శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తోంది. యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ లోనూ శ్రీలీల హీరోయిన్ కావడం విశేషం. ఇంకా, మరో ఇద్దరు యంగ్ హీరోల సినిమాల్లోనూ ఆమెనే ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరీ ఇంత డిమాండ్ ఉన్నప్పుడు, రేటు పెంచడంలో ఎలాంటి తప్పు లేదు అని కొందరు అభిప్రాయపడుతుండటం విశేషం.

Tags:    
  • Sreeleela 
  • FilmIndustry 
  • SreeleelaCareer 
  • SreeleelaProjects 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS