• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డాన్సింగ్‌ కింగ్‌ ఎవరో...

డాన్సింగ్‌ కింగ్‌ ఎవరో చెప్పిన డాన్సింగ్‌ క్వీన్‌

| ఆ ప్రెస్‌ మీట్‌లో శ్రీలీల మాట్లాడుతూ ఉండగా ఒక రిపోర్టర్‌.. మీరు డాన్సింగ్‌ క్వీన్‌ అంటున్నారు, మరి డాన్సింగ్‌ కింగ్‌ ఎవరు అని మీరు భావిస్తున్నారు అంటూ ప్రశ్నించాడు.

By - Tupaki Desk
Update: 2024-11-27 05:00 GMT

'పుష్ప 2'లో శ్రీలీల చేసిన ఐటెం సాంగ్‌ కిస్సిక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తక్కువ సమయంలోనే ఈ పాట ఏకంగా 50 మిలియన్‌ల వ్యూస్‌ను రాబట్టింది. డాన్సింగ్‌ క్వీన్‌ అంటూ పుష్ప మేకర్స్‌ శ్రీలీలకు ట్యాగ్‌ ఇవ్వడం జరిగింది. ఈ ఐటెం సాంగ్‌ను డాన్సింగ్‌ క్వీన్‌ చేయడం ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుకుమార్‌ ప్రతి ఎంపిక చాలా ఆలోచించి చేస్తారు. ఈ పాట కోసం ఆయన శ్రీలీలను ఎంపిక చేయడం అంటే కచ్చితంగా ఆమె పట్ల ఆయనకు ఉన్న నమ్మకంగా అని చెప్పుకోవచ్చు. ఐటెం సాంగ్ అంటే డాన్స్ ముఖ్యం. శ్రీలీల డాన్స్‌లో క్వీన్‌ కనుక ఎంపిక జరిగింది.

శ్రీలీల మరో వైపు నితిన్‌తో కలిసి రాబిన్‌హుడ్‌ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా నుంచి ఒక పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అందుకు సంబంధించిన ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్‌ మీట్‌లో శ్రీలీల మాట్లాడుతూ ఉండగా ఒక రిపోర్టర్‌.. మీరు డాన్సింగ్‌ క్వీన్‌ అంటున్నారు, మరి డాన్సింగ్‌ కింగ్‌ ఎవరు అని మీరు భావిస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు శ్రీలీల కాస్త తడుముకుంది. పక్కన నితిన్‌ ఉండగా మరో హీరో పేరు చెబితే ఎలా ఉంటుందో అని ఆలోచించిందో ఏమో నితిన్‌ మంచి డాన్సర్‌ అంటూ ఏదో సమాధానం చెప్పబోయింది. వెంటనే నితిన్ మైక్ అందుకుని ఈ సినిమాని పక్కన పెట్టి డాన్సింగ్‌ కింగ్‌ ఎవరు అంటూ చెప్పమని అన్నాడు.

నితిన్ అలా అనగానే వెంటనే శ్రీలీల తడుముకోకుండా అల్లు అర్జున్ పేరు చెప్పింది. కిస్సిక్‌ పాట షూటింగ్‌ సమయంలో అల్లు అర్జున్‌ నుంచి శ్రీలీల చాలా విషయాలు నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. తనకు డాన్సింగ్‌ కింగ్‌ అల్లు అర్జున్‌ అంటూ మీడియా ముందు శ్రీలీల ఫుల్‌ క్లారిటీ ఇచ్చింది. నిజంగానే టాలీవుడ్‌లో డాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల అయితే కచ్చితంగా డాన్సింగ్‌ కింగ్‌ అల్లు అర్జున్‌ అనడంలో సందేహం లేదు. అల్లు అర్జున్‌ తన ప్రతి సినిమాలోనూ డాన్స్‌తో ఇరగ దీస్తున్నాడు. యంగ్ హీరోల్లో బెస్ట్‌ డాన్సర్‌ అంటే పలువురి పేర్లు వినిపిస్తాయి. అందులో అల్లు అర్జున్ ముందు ఉంటాడు అనడంలో సందేహం లేదు.

శ్రీలీల పుష్ప 2 లో ఐటెం సాంగ్ చేయడం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఒకేసారి రాబిన్‌హుడ్‌ సినిమాతోనూ ఈమె రాబోతుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే మళ్లీ శ్రీలీల పూర్వపై వైభవం సంతరించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఈమెకు తమిళ్‌ స్టార్‌ హీరో శివ కార్తికేయన్‌తో సినిమా చేసే అవకాశం దక్కింది. త్వరలోనే ఆ విషయమై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమిళ్‌, తెలుగు సినిమాలతో పాటు కన్నడంలోనూ ఈమె సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది.

#AlluArjun Garu is my 'Dancing King' - #Sreeleela #KissikSong #Pushpa2TheRule #Pushpa2 #Robinhood #Tupaki pic.twitter.com/iKSE2TXEvL

— Tupaki (@tupaki_official) November 27, 2024
Tags:    
  • Sreeleela 
  • Nithiin 
  • Robinhood 
  • Robinhoodmovie 
  • Venkykudumula 
  • Mythrimoviemakers 
  • Alluarjun 
  • Pushpa2 
  • Kissiksong 
  • Dancingking 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS