సౌత్ వర్సెస్ నార్త్ హీరోయిన్ల మధ్య పోటీ!
ఈ మధ్య కాలంలో సౌత్ వర్సెస్ నార్త్ హీరోయిన్ల మధ్య పోటీ అంతకంతకు పెరుగుతోంది. భాషా బేధాలు చెరిగిపోయి పాన్ ఇండియా సినిమాలు చేస్తోన్న తరుణంలో నటీమణులు ఒకరికొకరు పోటీగా శ్రమిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సౌత్ వర్సెస్ నార్త్ హీరోయిన్ల మధ్య పోటీ అంతకంతకు పెరుగుతోంది. భాషా బేధాలు చెరిగిపోయి పాన్ ఇండియా సినిమాలు చేస్తోన్న తరుణంలో నటీమణులు ఒకరికొకరు పోటీగా శ్రమిస్తున్నారు. సినిమాలలో రాణించడానికి హీరోయిన్లు అభినయానికే కాకుండా గ్లామర్ పర్ఫార్మెన్స్ రెండింటిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. అయితే ఈ ట్రెండ్‌లో నార్త్ బ్యూటీలు గ్లామర్ షోతో దూసుకుపోతుంటే సౌత్ భామలు కొంత వెనుక బడినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఉత్తరాది నుంచి వస్తోన్న నటీమణులు ప్రారంభం నుంచే గ్లామర్ పాత్రలకు ఎలాంటి సంకోచం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ముంబై ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భామలు సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ను పెంచు కోవడానికి, ట్రెండ్‌కు తగ్గట్టుగా అట్రాక్టివ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు. స్క్రీన్పై బోల్డ్ అండ్ గ్లామరస్‌గా కనిపించడంలో ఏమాత్రం వెనుకాడకపోవడంతో దర్శక నిర్మాతలు కూడా కమర్షియల్ ప్రాజెక్ట్‌ల కోసం వారి వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ధోరణి నార్త్ హీరోయిన్లకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతోంది.
మరోవైపు సౌత్ భామలు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నా? గ్లామర్ ప్రదర్శన విషయంలో కొంత హద్దులు పెట్టుకుంటున్నారనే అభిప్రాయం ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు , తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన నటీమణులు కథాబలమున్న పాత్రలకు, అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే పాన్ ఇండియా ట్రెండ్‌లో నటన మాత్రమే కాకుండా కమర్షియల్ హంగులు కూడా అవసరమవుతుండటంతో సౌత్ భామలు కొంత వెనుకబడుతున్నారనే వాదన వినిపిస్తోంది.
అయితే ఈ పోటీని గ్లామర్ కోణంలోనే కాకుండా నటనా సామర్థ్యం పరంగా కూడా బేరీజు వేయాల్సి ఉంటుంది. సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటీమణులు సహజమైన నటనతో, ఎలాంటి పాత్రనైనా లీనమై చేయగలమనే నమ్మకాన్ని ఇండస్ట్రీకి ఇస్తున్నారు. గ్లామర్ షో కంటే బలమైన ఎమోషన్స్ పండించడంలో సౌత్ హీరోయిన్లదే పైచేయిగా ఉంటోందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినా? నేటి గ్లోబల్ ఆడియన్స్ ఆశించే గ్లామర్ .. స్టైలిష్ అప్పీల్‌ను అందుకోవడంలో వారు మరింత శ్రమించాల్సిన అవసరం ఉంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా సౌత్ భామలు కూడా తమ పంథాను మారుస్తున్నారు. పద్ధతిగల పాత్రలకే పరిమితం కాకుండా మోడ్రన్ లుక్స్ , గ్లామర్ రోల్స్‌కు సైతం సై అంటున్నారు. నార్త్ హీరోయిన్లకు దీటుగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోషూట్‌లతో సందడి చేస్తున్నారు. దర్శక నిర్మాతలను ఆకర్షిస్తున్నారు. ఈ పరిణామం ఇండస్ట్రీలో పోటీని మరింత రసవత్తరంగా మారుస్తోంది.
మొత్తానికి, నార్త్ హీరోయిన్లు దూకుడుగా గ్లామర్‌తో ముందుకువెళ్తుంటే, సౌత్ భామలు అభినయం మరియు గ్లామర్‌ల సమపాళ్లతో రాణించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఆరోగ్యకరమైన పోటీ నటీమణుల మధ్యే కాకుండా, చిత్ర పరిశ్రమలోని చిత్రాల స్థాయిని కూడా పెంచుతోంది. రాబోయే రోజుల్లో ఏ ప్రాంతం నటీమణులు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ ప్రభావాన్ని చూపుతారనేది ప్రేక్షకుల ఆదరణపైనే ఆధారపడి ఉంటుంది.