స్టార్ హీరోయిన్ల పెళ్లి వేటలో తల్లిదండ్రులు!

అలాగే విజ‌య్ వ‌ర్మ‌తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన‌ తమన్నా భాటియా పెళ్లిపై కూడా చర్చలు జరుగుతున్నాయి.;

Update: 2026-05-01 00:30 GMT

స్టార్ హీరోయిన్ల వ్యక్తిగత జీవితంపై అభిమానులకు అమితమైన ఆసక్తి ఉండ‌టం స‌హ‌జం. ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్‌ను ఏలుతున్న టాప్ హీరోయిన్లు పెళ్లి వయసు దాటినా ఇంకా సింగిల్‌గానే కొనసాగుతుండటంతో? వారి పెళ్లి ఎప్పుడనే ప్రశ్న సోషల్ మీడియాలో తరచుగా వినిపిస్తోంది. త్రిష, తమన్నా, అనుష్క, సాయిపల్లవి, శ్రుతి హాసన్ ఐశ్వర్యా రాజేష్ వంటి స్టార్ హీరోయిన్ల తల్లిదండ్రులు కుమార్తెల కోసం సీరియస్‌గా పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. దక్షిణాది సినిమాల్లో లేడీ సూపర్ స్టార్ గా వెలుగుతోన్న అనుష్క శెట్టి పెళ్లి వార్తలు గత కొన్నేళ్లుగా వస్తూనే ఉన్నాయి.

44 ఏళ్లు సమీపిస్తున్నా ఆమె ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో కుటుంబ సభ్యులు మంచి సంబంధాన్ని ఖాయం చేసే పనిలో నిమగ్నమైనట్లు క‌న్న‌డ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవల అనుష్క టీమ్ పెళ్లి వార్తలను ఖండించినా? బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం సంబంధాల వేట సాగుతూనే ఉందని తెలిసింది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిష విషయంలోనూ ఆమె తల్లి సీరియస్‌గా వరుడిని వెతుకుతున్నారట. 2026 లో ఎలాగైనా కుమార్తెను ఓ ఇంటిదాన్ని చేయాల‌ని త‌ల్లిదండ్రులు సీరియ‌స్ గా ఉన్న‌ట్లు కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

అలాగే విజ‌య్ వ‌ర్మ‌తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన‌ తమన్నా భాటియా పెళ్లిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. విజ‌య్ తో క‌టీఫ్ అయిన ద‌గ్గ‌ర నుంచి మిల్కీబ్యూటీ తల్లిదండ్రులు కూడా సీరియ‌స్ గానే ఆలోచ‌న చేస్తున్నారుట‌. అలాగే లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి వ‌స్తోన్న‌ రూమర్లపై స్పందించిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం తాను సినిమాలతో బిజీగా ఉన్నానని చెబుతున్నా? ఆమె కుటుంబం మాత్రం సంప్రదాయ పద్ధతిలో మంచి సంబంధం కోసం చూస్తున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్రేమ పెళ్లికి సాయి ప‌ల్ల‌వి దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో త‌ల్లిదండ్రుల తెచ్చిన కుర్రాడికే ఒకే చెబుతుంద‌ని తేలిపోయింది. కమల్ హాసన్ తనయ శ్రుతి హాసన్ స్వతంత్ర భావాలకు పేరుగాంచిన నటి. డాడ్ కొన్ని అవ‌కాశాలు ఇచ్చినా శ్రుతి వాటిలో ఫెయిలైంది. దీంతో శ్రుతి హాస‌న్ పెళ్లి బాధ్య‌త‌లు క‌మ‌ల్ తీసుకున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆమెకు నచ్చేలా, ఆమె అభిరుచులకు సరిపోయే వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభమైందని సమాచారం. అలాగే తెలుగు న‌టి ఐశ్వర్యా రాజేష్ ఇంట్లో కూడా పెళ్లి బాజాలు మోగించేందుకు ప్రయత్నాలు ముమ్మ‌రం చేసారుట‌. ఐశ్వ‌ర్య‌పై ఇంత వ‌ర‌కూ ఎలాంటి రూమ‌ర్లు లేవు. క్లీన్ అండ్ గ్రీన్ గా అమ్మ‌డి ట్రాక్ క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో పెద్దల సంబంధానికే ఐశ్వ‌ర్య ఒకే చెబుతుంద‌ని తెలుస్తోంది. మ‌రి వెండితెరపై కోట్లాది మంది మనసు గెలుచుకున్న సుందరాంగులకు ఎలాంటి వ‌రుడు దొరుకుతాడో? చూడాలి.

Tags:    

Similar News