ఐశ్వ‌ర్యారాయ్ ని ఆంటీ అన‌డంలో త‌ప్పే ముంది?

నటీనటుల మధ్య సంభాషణలు.. ఒకరిపై ఒకరు చేసే వ్యాఖ్యలు తరచుగా వివాదాలకు దారితీస్తుంటాయి.

Update: 2026-06-15 10:30 GMT

నటీనటుల మధ్య సంభాషణలు.. ఒకరిపై ఒకరు చేసే వ్యాఖ్యలు తరచుగా వివాదాలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో స్టార్స్ మధ్య ఉండే సంబంధాలు, పబ్లిక్ వేదికలపై వారు మాట్లాడే మాటలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. కొన్నిసార్లు నటీనటులు ఎంతో సాధారణంగా అన్న మాటలు కూడా అభిమానుల మధ్య ..పరిశ్రమలో చర్చకు, మనస్పర్థలకు కారణమవుతుంటాయి. ఇలాంటి ఓ పాత ఐకానిక్ వివాదం బాలీవుడ్ స్టార్స్ సోనమ్ కపూర్ - ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మధ్య చోటుచేసుకుంది. ఓ సందర్భంలో 36 ఏళ్ల వయసులో ఉన్న ఐశ్వర్య రాయ్‌ను సోనమ్ కపూర్ బహిరంగంగా ఆంటీ అని పిలవడం ఇండస్ట్రీ వర్గాలలో పెద్ద సంచలనం సృష్టించింది.

ఒక యువ నటి అంతటి సీనియర్ .. క్రేజ్ ఉన్న అగ్ర కథానాయకిని అలా సంబోధించడంపై అప్పట్లో మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సోనమ్ కపూర్ తన మాటలను సమర్థించుకుంటూ ఆసక్తికర వివరణ ఇచ్చారు. ఐశ్వర్య రాయ్ తన తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి స్క్రీన్ పంచుకున్నారని.. ఆయనకు జోడీగా నటించారని సోనమ్ గుర్తుచేశారు. ఆ రకంగా చూస్తే ఐశ్వర్య తనకంటే ఎంతో సీనియర్ అని.. అందుకే తాను ఆమెను ఆంటీ అని పిలవడంలో తప్పులేదని భావించినట్లు సోనమ్ స్పష్టం చేశారు. ఈ వివరణ వివాదాన్ని సర్దుమణిగేలా చేయడం పక్కన పెడితే, మరింత చర్చకు దారితీసింది.

సినిమా ఇండస్ట్రీలో వయసు, వారి సీనియారిటీని ఉద్దేశించి చేసే వ్యాఖ్యల పట్ల నటీమణులు చాలా సున్నితంగా ఉంటారు. ఐశ్వర్య రాయ్ వంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన నటిని ఆంటీ అనడం ఆమె అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అయినా? ఐశ్వర్య రాయ్ ఈ వివాదంపై ఎన్న‌డు బహిరంగంగా స్పందించి రచ్చ చేయ‌లేదు. తనదైన హుందాతనాన్ని కాపాడుకున్నారు. కానీ ఇరు వర్గాల మధ్య కొంతకాలం పాటు ప్రచ్ఛన్న యుద్ధం నడిచిందనే ప్రచారం జరిగింది. ఈ తరహా సంఘటనలు చిత్ర పరిశ్రమలో తరం మారేటప్పుడు వచ్చే మార్పులను, ఆలోచనా విధానాలను ప్రతిబింబిస్తాయి. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే యువ నటీనటులు సీనియర్లను గౌరవించే క్రమంలో లేదా కుటుంబ బంధాల కోణంలో మాట్లాడినప్పుడు అది గ్లామర్ ప్రపంచంలో భిన్నంగా అర్థం చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

గ్లామర్ ఫీల్డ్‌లో వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అయినా? ఇలాంటి ట్యాగ్‌లు ఇమేజ్‌పై ప్రభావం చూపుతాయనే ఆందోళన ఉంటుంది. సెలబ్రిటీల వ్యక్తిగత ముచ్చట్లు ..పబ్లిక్ కామెంట్లు ఎప్పుడూ నిశిత పరిశీలనకు గురవుతాయి. సోనమ్ కపూర్ చేసిన ఆనాటి వ్యాఖ్యలు బాలీవుడ్ చరిత్రలో మరపురాని క్రేజీ అనెక్డోట్‌గా మిగిలిపోయాయి. కాలక్రమేణా సోనమ్ కపూర్ కూడా ఇండస్ట్రీలో సీనియర్‌గా ఎదిగారు. గతంలో జరిగిన చిన్నపాటి వివాదాలు స్టార్స్ మధ్య సంబంధాలను తాత్కాలికంగా చేసినప్పటికీ కాలక్రమేణా వాటిని మర్చిపోయి ముందడుగు వేయడం విశేషం.

Tags:    

Similar News