ఆ ఫేక్ న్యూస్ కి ఇరవై ఏళ్లు...!

తాజాగా ది బ్రోకెన్‌ న్యూస్‌ సీజన్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతా అనుకున్నట్లుగానే సోనాలి తన నటనతో మెప్పించింది

Update: 2024-05-16 02:45 GMT

బాలీవుడ్‌ సినిమాలతో పాటు టాలీవుడ్‌ లో ఇంద్ర, మురారితో పాటు పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ సోనాలి బింద్రే పెళ్లి, పిల్లల వల్ల ఇండస్ట్రీకి దూరం అయ్యింది. పిల్లలు పెద్ద వారు అవ్వడంతో పాటు, తన వయసుకు తగ్గ పాత్రలు వస్తున్న కారణంగా సోనాలి బింద్రే మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది.

తాజాగా ది బ్రోకెన్‌ న్యూస్‌ సీజన్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతా అనుకున్నట్లుగానే సోనాలి తన నటనతో మెప్పించింది. ఆమె ఓకే అనాలే కానీ వరుసగా ఆమెకు ఆఫర్లు వస్తాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సోనాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

చాలా ఏళ్లుగా సోనాలి బింద్రే గురించి ఒక పుకారు తెగ ప్రచారం జరుగుతుంది. అదేంటి అంటే పాకిస్తాన్‌ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఒకానొక సమయంలో సోనాలి బింద్రే అంటే విపరీతమైన అభిమానం, ప్రేమ కనబర్చాడు. సోనాలి ని పెళ్లి చేసుకుంటాను, ఒక వేళ ఆమె ఒప్పుకోకుంటే కిడ్నాప్ చేసి అయినా పెళ్లి చేసుకుంటాను అన్నట్లుగా మాట్లాడాడట.

ఆ విషయాన్ని తాజాగా సోనాలి బింద్రే వద్ద ప్రస్తావించగా తాను అప్పటి నుంచి ఈ వార్త వింటూనే ఉన్నాను. అయితే అతడు అన్నట్లుగా నా వద్దకు ఎలాంటి ఆధారం రాలేదు. అతడు అని ఉండడు అని నేను అనుకుంటున్నాను. అక్తర్ అభిమానం పొందడం ను కచ్చితంగా ఆనందిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

కొన్ని సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని పాక్ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్ వద్ద కూడా ఒక మీడియా సంస్థ ప్రస్థావించింది. అయితే ఆ సమయంలో షోయబ్‌ మాట్లాడుతూ తాను సోనాలి బింద్రే గురించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదు అన్నాడు. అంతేకాకుండా ఆమెను ఎప్పుడు కూడా చూడలేదు అని కూడా చెప్పుకొచ్చాడు. మరి ఈ పుకారు ఇప్పటికి అయినా ఆగేనా చూడాలి.

Tags:    

Similar News