బ్రైడల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న శోభిత.. ఫోటోలు వైరల్!
అలాగే వివాహం తర్వాత పనిని, వైవాహిక జీవితాన్ని ఎలా సమతుల్యం చేస్తున్నారు అని ప్రశ్నించగా.. నచ్చితే ఎంతటి కష్టమైనా సరే సులభంగా అనిపిస్తుంది.;
అక్కినేని కోడలుగా, ప్రముఖ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది శోభిత ధూళిపాళ్ల. ముఖ్యంగా నాగచైతన్యతో ప్రేమలో పడిన తర్వాత భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. గత ఏడాది డిసెంబర్ 4న అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహం జరిగింది. ఇక అప్పటి కారణాలవల్ల వీరు తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. కానీ ఈ ఏడాది తొలి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా తమ పెళ్లి వీడియోని షేర్ చేసింది శోభిత.
అంతేకాదు తమ పెళ్ళికి సంబంధించిన పలు రకాల ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఇదిలా ఉండగా మరొకవైపు ఒక బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా బ్రైడల్ లుక్కులో తన అందంతో మరోసారి మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. గోల్డెన్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన లెహంగాను ధరించిన శోభిత అందులో యువరాణిలా కనిపిస్తూ.. అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది. గోల్డెన్ కలర్ లెహంగాకి అందుకు తగ్గట్టుగానే ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన ఈ లెహంగా ఈమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది అని చెప్పడంలో సందేహం లేదు. అలా తన టోటల్ మేకోవర్ తో మరోసారి వార్తల్లో నిలిచింది శోభిత. ప్రస్తుతం ఈ వీడియో తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.
ఇదిలా ఉండగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన శోభిత.. వివాహం తర్వాత నాగచైతన్యతో హైదరాబాద్ మొత్తం చుట్టేయాలనుకున్నాను. కానీ నా రెండు సినిమాల బిజీ షెడ్యూల్స్ కారణంగా 160 రోజులు దూరంగా ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమాల షూటింగ్ జరిగింది అంటూ తెలిపింది.
అలాగే వివాహం తర్వాత పనిని, వైవాహిక జీవితాన్ని ఎలా సమతుల్యం చేస్తున్నారు అని ప్రశ్నించగా.. నచ్చితే ఎంతటి కష్టమైనా సరే సులభంగా అనిపిస్తుంది. నచ్చకపోతే ఎంత సులభమైన పనైనా సరే కష్టంగా అనిపిస్తుంది అని సమాధానం చెప్పి, అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే నాగచైతన్య తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన జీవితం పూర్తిగా పరిపూర్ణం చెందింది అని, ప్రస్తుతం ఆయన లేని క్షణాలు అసంపూర్ణం అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే శోభిత ధూళిపాళ్ల తన భర్త పై ఉన్న ప్రేమను ఈ రూపంలో తెలియజేస్తోంది.
శోభిత బాల్యం , కెరియర్ విషయానికి వస్తే..1993 మే 31న వేణుగోపాలరావు , శాంతారావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలిలో జన్మించింది ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. ముంబై యూనివర్సిటీ హెచ్ ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసిన ఈమె సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం , కూచిపూడిలలో కూడా శిక్షణ తీసుకుంది. చదువుకుంటున్న సమయంలోనే మోడల్గా తన కెరీర్ను ఆరంభించిన ఈమె 2013లో మిస్ అందాల పోటీలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది అలాగే 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొని తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.