• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాహుబలి నిర్మాత కౌంటర్.....

బాహుబలి నిర్మాత కౌంటర్.. ఎవరు ఆ యువ హీరో?

| అయితే ఆ పోస్ట్ చేసిన కొద్దీ సేపటికే ఆయన దాన్ని డిలీట్ చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2023-07-31 13:46 GMT

బాహుబలి సిరీస్ తో స్టార్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని శోభు యార్లగడ్డ సొంతం చేసుకున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత వీరు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్లి సందడి మూవీ చేశారు. దానైకంటే ముందుగా సత్యదేవ్ తో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీ చేశారు. పెద్ద ప్రాజెక్ట్స్ ఏవీ కూడా చేయడం లేదు. ప్రస్తుతం సొంత వ్యాపారాలపైన వారి ద్రుష్టి పెట్టారు.

శోభు యార్లగడ్డ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా రెగ్యులర్ పోస్టులు పెడుతూ ఉంటారు. తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఒక యంగ్ హీరో, డెబ్యూ డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ వినడానికి కూడా ఆసక్తి చూపించకుండా అతన్ని అగౌరవపరిచాడు.

ఇది అతని కెరియర్ కి ఏ విధంగా కూడా ఉపయోగపడదు. కచ్చితంగా ఈ విషయాన్ని అతను త్వరలోనే తెలుసుకుంటాడు అని శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఉన్నపళంగా నిర్మాత ఇలాంటి ట్వీట్ చేయడం వెనుక రీజన్ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య టాలీవుడ్ ఓ హీరో, దర్శకుడికి సంబందించిన ఇష్యూ నడుస్తోంది. దీనిని ఉద్దేశించి నిర్మాత శోభు యార్లగడ్డ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే మాట వినిపిస్తోంది.

అయితే ఆ పోస్ట్ చేసిన కొద్దీ సేపటికే ఆయన దాన్ని డిలీట్ చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పై నెటిజన్లు కూడా భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఎవరు దృష్టిలో వారు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు టాలీవుడ్ లో ఇది మొదటిసారి కాదు.

చాలా సార్లు ఇలాంటివి జరిగాయి. అయితే వీటి వలన టాలీవుడ్ లో విభేదాలు పెరగడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఎలాంటి అంశాలలో ఎవరూ రెస్పాండ్ అవ్వకుండా ఉండటం బెటర్ అనే మాట వినిపిస్తోంది. శోభు యార్లగడ్డ పోస్ట్ వైరల్ కావడంతో దీనిపై ఎవరైనా టాలీవుడ్ సెలబ్రెటీలు రియాక్ట్ అవుతారా అనేది ఆసక్తిగా మారింది.

Tags:    
  • Sobhuyarlagadda 
  • Baahubali 
  • Producer 
  • BABYMovie 
  • Tollywood 
  • Younghero 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS