ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు.. పెళ్లిపై శోభిత కామెంట్స్!
పెళ్లి తర్వాత దాదాపు 160 రోజులపాటు ఆ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొన్నాను. దాని కోసం ఎక్కువగా తమిళనాడులోనే ఉండాల్సి వచ్చింది.;
ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. నాగచైతన్యతో వివాహం జరిగి ఏడాది కావడంతో తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ఆమె.. ఎన్నో విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగానే "ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదంటూ" కామెంట్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. శోభిత ధూళిపాళ్ల వివాహం తర్వాత జరిగిన పలు విషయాలపై మాట్లాడుతూ.." చైతూ తో వివాహం తర్వాత ఎన్నో చేయాలనుకున్నాను. హైదరాబాద్ మొత్తం చుట్టేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. 2 సినిమాలతో బిజీ కావడం వల్ల అప్పటికి నా కల నెరవేరలేదు.
పెళ్లి తర్వాత దాదాపు 160 రోజులపాటు ఆ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొన్నాను. దాని కోసం ఎక్కువగా తమిళనాడులోనే ఉండాల్సి వచ్చింది. వివాహం తర్వాత నా భర్తను విడిచి ఉండాల్సిన రోజులు పెళ్లి తర్వాత వస్తాయని అసలు అనుకోలేదు" అంటూ పెళ్లి తర్వాత చైతన్యకి దూరంగా ఉండడం పై కామెంట్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాగే వైవాహిక జీవితం గురించి ఆమె మాట్లాడుతూ.." మనకు ఏదైనా ఒక విషయం నచ్చింది అంటే దానిని ఎలాగైనా సరే సాధిస్తాము. ఇక నచ్చకపోతే ఎంత సులభమైన పనైనా సరే కష్టంగానే అనిపిస్తుంది" అంటూ తెలిపింది. ప్రస్తుతం శోభిత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇక నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే... మోడల్గా కెరియర్ను ఆరంభించిన ఈమె.. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇకపోతే తెలుగులో చేసింది తక్కువ సినిమాలు కావడంతో పెద్దగా ఈమె గురించి ఎక్కువగా తెలిసిన వాళ్ళు లేరనే చెప్పాలి. కానీ ఎప్పుడైతే నాగచైతన్యతో ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయో అప్పటినుంచి ట్రెండింగ్ లో నిలిచింది శోభిత..
ముఖ్యంగా నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత 2022లో శోభితతో కలిసి లండన్ లో ఒక రెస్టారెంట్లో కనిపించారు. ఆ హోటల్ చెఫ్ నాగ చైతన్యతో దిగిన ఫోటో షేర్ చేయగా.. అందులో శోభిత కనిపించడంతో ఇక వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఎన్నో ప్రదేశాలలో వీరిద్దరూ కనిపించడంతో రిలేషన్ ని కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ జంట ఎక్కడ తమ బంధాన్ని రివీల్ చేయలేదు. కానీ ఎట్టకేలకు గత ఏడాది జూన్లో నిశ్చితార్థం చేసుకోగా.. ఆ విషయాన్ని నాగార్జున అందరితో తెలియజేశారు. వీరి వివాహం గత ఏడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ విగ్రహం ముందు బంధువులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇకపోతే అప్పటి పరిస్థితుల దృష్ట్యా వారి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను పెద్దగా పంచుకోలేదు.
కానీ ఈ ఏడాదికి వివాహం జరిగి ఏడాది కావడంతో తొలి వార్షికోత్సవం సందర్భంగా తమ వెడ్డింగ్ వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా శోభిత షేర్ చేసింది. ఆ వీడియోలో పెళ్లికి సంబంధించిన పలు విషయాలను అటు నాగ చైతన్య శోభిత పంచుకోవడమే కాకుండా.. ఒకరిపై మరొకరికున్న అభిప్రాయాలను కూడా చెప్పుకొచ్చారు.