బుల్లితెర‌పై అత్య‌ధిక పారితోషికం పొందే న‌టి

పాపుల‌ర్ టీవీ సీరియ‌ల్ లో తులసి విరానీ పాత్రను తిరిగి పోషించేందుకు స్మృతి సిద్ధంగా ఉన్నారు.;

Update: 2025-08-08 22:30 GMT

భార‌త‌దేశంలో అత్య‌ధిక పారితోషికం అందుకునే టీవీ న‌టి ఎవ‌రు? అంటే.. దీనికి స‌మాధానం వెంట‌నే చెప్ప‌లేం. ఇప్పుడు ఒక జ‌వాబు దొరికింది. రాజకీయ నాయకురాలు, సీనియ‌ర్ సినీన‌టి స్మృతి ఇరానీ `క్యుంకీ సాస్ భీ కభీ బహు థి 2`తో బుల్లితెర‌పైకి రీఎంట్రీ ఇస్తూ, ఇండ‌స్ట్రీ బెస్ట్ పారితోషికం అందుకోవ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఎపిసోడ్‌కు 14ల‌క్ష‌ల పారితోషికం..

పాపుల‌ర్ టీవీ సీరియ‌ల్ లో తులసి విరానీ పాత్రను తిరిగి పోషించేందుకు స్మృతి సిద్ధంగా ఉన్నారు. అయితే ఒక‌ ఎపిసోడ్‌కు రూ.14 లక్షల పారితోషికం అందుకుంటున్నార‌ని తెలుస్తోంది. భారతీయ టీవీ రంగంలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటిగా స్మృతి రికార్డుల‌కెక్కారు. అయితే తాజా ఇంట‌ర్వ్యూలో వెట‌ర‌న్ న‌టి స్మృతిని ఈ విష‌యంపై విలేఖ‌రులు ప్ర‌శ్నించ‌గా, బుల్లితెర‌పై అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్నాన‌ని మాత్ర‌మే చెప్పారు. అయితే తాను ఎంత ప్యాకేజీ అందుకుంటున్న‌ది ఈ సీనియ‌ర్ న‌టి రివీల్ చేయ‌లేదు.

ఈ న‌టికి ఎపిసోడ్ కి 3ల‌క్ష‌లు:

హిందీ బుల్లితెర‌పై `అనుపమా` స్టార్ రూపాలి గంగూలీ ఎపిసోడ్‌కు రూ.3 లక్షలు సంపాదిస్తున్నట్లు క‌థ‌నాలొచ్చాయి. హీనా ఖాన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2 లక్షలు ఆర్జిస్తుంది. ఇంకా చాలా మంది బుల్లితెర హోస్ట్ లు, న‌టీన‌టులు భారీ పారితోషికాల‌ను అందుకుంటున్నారు. టీవీ మూవీ న‌టీమ‌ణుల్లో ప‌లువురు ల‌క్ష అంత‌కుమించి ఒక ఎపిసోడ్ కు అందుకుంటున్న వారు ఉన్నారు.

2 ద‌శాబ్ధాల క్రితం 8 ఏళ్లు ఏలిన సీరియ‌ల్:

2000లో తులసిగా ఆరంగేట్రం చేసినప్పటి నుండి భార‌తీయ బుల్లితెర‌పై అత్యధికంగా సంపాదిస్తున్న నటిగా స్మృతి ఇరానీకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. తాను ఆర్టిస్టుల సంఘంలో స‌భ్యురాలిగా ఉన్నారు. పెద్ద నిర్మాణ సంస్థ‌ల్లో న‌టించారు. మేల్ స్టార్ల‌కు ధీటుగా వేత‌నం చెల్లించాల‌ని అడ‌గ‌డానికి సంకోచించ‌కూడ‌ద‌ని స్మృతి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో అన్నారు.

మైమ‌రిపించిన కోడ‌లు తుల‌సి విరానీ:

క్యుంకి సాస్ భీ కభి బహు థి పునరాగమనంతో స్మృతి ఇరానీ చాలా ఆనందంగా ఉన్నారు. విరానీ కుటుంబంలో ఆద‌ర్శ కోడ‌లు తుల‌సి విరానీగా ఈ సీరియ‌ల్ లో త‌న న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ప్ర‌జ‌లు మైమ‌రిచిపోయారు. విరానీ అనేది ఇంటి పేరుగా మారింది. కుటుంబ వివాదాలు, సంప్రదాయాలు ఇత‌ర‌ నైతిక సవాళ్లను ఎదుర్కొని నిలిచే కోడ‌లుగా క‌నిపించింది. ఈ సీరియ‌ల్ ఏకంగా ఎనిమిది సంవత్సరాల పాటు నడిచింది. భారతీయ టీవీ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన సీరియ‌ళ్ల‌లో ఇది ఒకటి.

Tags:    

Similar News