• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కూతురు సెంటిమెంట్​తో...

కూతురు సెంటిమెంట్​తో సిద్ధార్థ్.. ఈ సారైనా గట్టెక్కుతారా

| ఆయన కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ చిత్తా. ఈ చిత్రంతో ఆయన నిర్మాతగా మారారు. సినిమాను రెడ్ జెయింట్ మూవీస్, ఈటాకీ ఎంట‌ర్‌టైన‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

By - Tupaki Desk
Update: 2023-09-27 16:07 GMT

టాలీవుడ్​లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటాన, బొమ్మరిల్లు, ఓయ్ వంటి సక్సెస్​ ఫుల్ మూవీస్​లో నటించి యూత్​లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ చిత్తా. ఈ చిత్రంతో ఆయన నిర్మాతగా మారారు. సినిమాను రెడ్ జెయింట్ మూవీస్, ఈటాకీ ఎంట‌ర్‌టైన‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఈ సినిమా మరో రోజులో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్​లో భాగంగా తాజాగా సిద్ధార్థ్ ఓ చైన్నెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తాను సహజత్వంతో కూడిన మంచి కథ చిత్రం చేయాలని అనుకున్నట్లు తెలిపారు. అందుకే ఈ సినిమాను నిర్మించినట్లు పేర్కొన్నారు.

నిర్మాతగా మారాలని నేను అనుకున్నప్పుడు ఎక్కడా రాజీ పడకుండా సహజత్వంతో కూడిన మంచి కథ ఉన్న చిత్రం చేయాలని అనుకున్నాను. అందుకే ప్రీ ప్రొడక్షన్‌ కోసమే దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నాను. సినిమాలోని చాలా సీన్స్​ను పళనిలో లైవ్‌గా షూట్ చేశాం. అని సిద్ధార్థ్ అన్నారు. ఈ చిత్రం తన నటనను చూసి ప్రశంసించిన సినీ ప్రముఖులకు, అభిమానులకు, సినీ ప్రియులకు కృతజ్ఞతలు కూడా తెలిపారు.

ఇకపోతే ఈ చిత్రంలో నిమిషా సజయన్‌, అంజలి నాయర్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్, ట్రైల‌ర్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రానికి ఎస్‌.యం అరుణ్‌ కుమార్‌ దర్శకుడిగా వ్యవహరించారు.

బాబాయికి.. చిన్నారికి మధ్య జరిగే ఓ ఎమోషనల్ డ్రామానే ఈ చిత్రం. అంతా సాఫీగా సాగే జీవితంలో త‌న కూతురు కిడ్నాప్​కు గురవ్వగా.. ఆమె కోసం సిద్ధార్థ్‌ చేసే పోరాటమే ఈ సినిమా కథ అని అర్థమవుతోంది. మరి ఈ కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకోవాలంటే సినిమాను తెరపై చూడాల్సిందే. కాగా, గత కొంతకాలంగా సిద్దార్థ్​కు సరైన హిట్ లేదు. రీసెంట్​గా వచ్చిన టక్కర్ కూడా అంతగా ఆడలేదు. మరి ఈ చిత్రంతోనైనా సిద్ధార్థ్​ సక్సెస్ ట్రాక్ ఎక్కుతడో లేదో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Starhero 
  • Chithha 
  • Chithhamovie 
  • Producer 
  • Hero 
  • Leadrole 
  • Redgiantmovies 
  • Eatakientertainments 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS