• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కామెడీ కోసం చేస్తే, కొంప...

కామెడీ కోసం చేస్తే, కొంప ముంచుతోందిగా..!

| బ్రో మూవీ లో అంబటి ని ఇమిటేట్ చేశారు, కామెడీ డ్యాన్సులు వేయించారు అనే విషయం తప్పితే, మిగిలిన సినిమా గురించి ఎవరూ చర్చించుకోవడం లేదు.

By - Tupaki Desk
Update: 2023-08-02 13:06 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలు ఫ్యాన్స్ ఎగపడి థియేటర్లలోకి అడుగుపెడుతూ ఉంటారు. స్పెషల్ గా అన్ని సినిమాల కు లాగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. దాదాపు ఆయన మూవీ ల ప్రమోషన్స్ చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ చేసినా, ఆయన అసలు పాల్గొనరు. ఆ బాధ్యతను మిగిలినవారు తీసుకుంటారు. వకీల్ సాబ్ సమయం లో నివేదా థామస్, అంజలి ఆ బాధ్యతను తీసుకున్నారు. ఇక బ్రో మూవీ విషయంలో సాయి ధరమ్ తేజ్ మూవీ ని జనాల్లోకి పాజిటివ్ గా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఓవైపు తేజ్ ఈ మూవీ చాలా బాగుందని, ఎమోషనల్ గా సాగుతుంది అని అందరూ చూడాలి అంటూ కోరుతుంటే, మరో వైపు ఒక్క సీన్ కారణంగా, ఈ మూవీ పై నెగిటివ్ ఇంప్రెషన్ పెరుగుతుండటం గమనార్హం. అదే శ్యాంబాబు టాపిక్. నిజానికి ఈ మూవీ ఒక వ్యక్తి కి చనిపోయిన తర్వాత, మళ్లీ మరో ఛాన్స్ అంటూ జీవితం లభిస్తుంది. అలాంటి సమయాన్ని అతను ఎలా ఉపయోగించుకున్నాడు అనేదే ఈ కథ. అయితే, ఇంత ఎమోషనల్ మూవీ లో స్పెషల్ గా ఏదో బలవంతంగా చొప్పించినట్లుగా ఈ శ్యాంబాబు క్యారెక్టర్ ని ప్రవేశపెట్టారు.

మూవీ లో ఆ సీన్ చూడటానికి సరదాగానే ఉంది. కానీ, దానిని మంత్రి అంబటి రాంబాబు ని ఇమిటేట్ చేస్తూ పెట్టడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. నిజానికి శ్యాంబాబు పాత్ర పెట్టాల్సిన అవసరం లేదు. కానీ, పెట్టారు. అలా పెట్టిన దానిని చూసీ, చూడనట్లుగా వదిలేయకుండా, మంత్రి అంబటి దాని ని జీడిపాకం లాగా లాగుతూనే ఉన్నారు.

ప్రెస్ మీట్లు పెట్టి మరీ పవన్ ని , డైరెక్టర్ త్రివిక్రమ్ ని తిడుతూ వార్నింగ్ లు ఇస్తున్నారు. అంతేకాకుండా, సినిమా ప్లాప్ అని, వసూళ్లు కూడా రావు అంటూ, నిర్మాత బ్లాక్ మనీ ఈ సినిమా కోసం పెట్టాడు అంటూ కూడా చెప్పాడు. అసలు ఆ పాత్ర అంబటి గురించి కాదు అని నిర్మాత చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఆయన వినిపించుకోవడం లేదు. ఆయనే కాదు, అది అంబటి ని ఇమిటేట్ చేసేలా పెట్టలేదు అంటే ఎవరూ నమ్మరు.

అయితే, ఇప్పుడు ఈ విషయం ఎలా మారింది అంటే, బ్రో మూవీ లో అంబటి ని ఇమిటేట్ చేశారు, కామెడీ డ్యాన్సులు వేయించారు అనే విషయం తప్పితే, మిగిలిన సినిమా గురించి ఎవరూ చర్చించుకోవడం లేదు. సినిమా లోని మొయిన్ కంటెంట్ వదిలేసి, జనాలు కూడా కేవలం దీని గురించే చర్చించుకోవడం విశేషం. ఈ రకం ప్రచారం, మూవీ కలెక్షన్ల పై ఎక్కువ ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. మరి ఈ వివాదానికి పులిస్టాప్ పడేది ఎప్పుడో.

Tags:    
  • Bro 
  • Bromovie 
  • Brofilm 
  • Pawankalyan 
  • Saidharamtej 
  • Smauthrikani 
  • Shyambabu 
  • Ambatirambabu 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS