• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్ - మేకప్ తో శృతి...

సలార్ - మేకప్ తో శృతి కూడా బయపెట్టేసింది!

| దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలా ఆలోచిస్తాడో కానీ ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలో ఉన్నన్ని క్యారెక్టర్లు మరే సినిమాలో కనిపించవనే చెప్పాలి

By - Tupaki Desk
Update: 2023-12-24 00:30 GMT

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలా ఆలోచిస్తాడో కానీ ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలో ఉన్నన్ని క్యారెక్టర్లు మరే సినిమాలో కనిపించవనే చెప్పాలి. ఒకరిని మించి మరొకరు అనేలా విలన్స్ భయపెట్టే టైమ్ లో హీరో దిగడం ఆయన మొదటి ఎలివేషన్. ఇక KGF లో లేడి క్యారెక్టర్స్ పెద్దగా ఫోకస్ చేయని నీల్ సలార్ లో మాత్రం శ్రేయ రెడ్డి, యాంకర్ ఝాన్సీ లాంటి పాత్రలను థ్రిల్లింగ్ గా చూపించాడు.

కొన్ని సీన్స్ లో అయితే శ్రేయ తన లుక్స్ కోపంగా చూస్తూ బయపెట్టేసింది. ఇక హీరోయిన్ శృతి హాసన్ కూడా బయపెట్టేసింది అనేలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సినిమాలో శ్రుతి హాసన్ క్యారెక్టర్ పై నెట్టింట రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రియులు. ప్రశాంతంగా, ఎంతో ఓపికగా ఉండే అమ్మాయి పాత్రలో ఆద్యగా శ్రుతి హాసన్ కనిపించింది. అయితే ఆమె క్యారెక్టర్ సినిమాపై పెద్ద ఇంపాక్ట్ చూపించలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ సినిమాలో శ్రుతి హాసన్ కు మేకప్ అసలు పూర్తిగా సెట్ కాలేదని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. సినిమా అంతా ఓకే అయినా శ్రుతి క్యారెక్టర్ ఎఫెక్ట్ ఏం లేదని అంటున్నారు. శ్రుతి మేకప్ బాలేకపోవడం వల్ల సినిమాలో ఆమె కాస్త ఆడ్ గా కనిపించిందని అని కామెంట్లు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్లు, ప్రభాస్ మాస్ యాక్షన్ వల్లే ఆమె అకౌంట్ లో ఓ హిట్ పడిందని చెబుతున్నారు.

మరోవైపు, ఇటీవలే శ్రుతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో సలార్ మూవీ టీమ్ తో తన అనుభవాలను పంచుకుంది. సలార్ సినిమా ప్రయాణం బలమైన స్నేహభావాన్ని పెంపొందించిందని చెప్పింది. టీమ్ అంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్లమని తెలిపింది. షూటింగ్ సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉన్నట్లు అనిపించేదని చెప్పింది. బాక్సాఫీస్ వసూళ్ల విషయంలో తానెప్పుడూ ఒత్తిడికి గురికాలేదని వివరించింది. సలార్ జర్నీలో ప్రభాస్ మంచి స్నేహితుడయ్యారని తెలిపింది.

ఇటీవలే నేచురల్ స్టార్ నటించిన హాయ్ నాన్న సినిమాలో పార్టీ సాంగ్ తో హోరెత్తించింది శ్రుతి. ఆ పాటను ఆమే పాడింది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ తో కలిసి డెకాయిట్ చిత్రంలో నటిస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే విడుదలైంది. దీంతో పాటు ఆమె హీరోయిన్ గా నటించిన హాలీవుడ్ సినిమా ది ఐ కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమాలు శ్రుతికి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో చూడాలి.

Tags:    
  • Shrutihaasan 
  • Salaarmovie 
  • Prabhas 
  • Prashanthneel 
  • Salaar 
  • Filmindustry 
  • Hinannamovie 
  • Nani 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS