హిజ్రాగా నటించడం ఆ నటికి ఓ డ్రీమ్!
ఇలాంటి పాత్రలో నటించడానికి ఎంత మాత్రం ఆలోచించచని..తన డ్రీమ్ రోల్ గా ఆ పాత్రను భావిస్తు న్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయంపై కొంత మంది దర్శకులతో కూడా మాట్లాడినట్లు గుర్తు చేసుకున్నారు.;
సాధారణంగా హిజ్రా తరహా పాత్రలు పోషించాలంటే ముందుకొచ్చే వారు తక్కువే. అందులోనూ ఫీమేల్స్ ఆ తరహా పాత్రలంటే ఎంత మాత్రం ఆసక్తి చూపించరు. మేల్ నటులైతే? కొత్తగా ఉంటుందని ఓ ప్రయ త్నం చేసే అవకాశం ఉంటుంది గానీ, మహిళా నటులైతే ముందుకు రావడం అన్నది చాలా అరుదు. ఇంత వరకూ ఏ దర్శకుడు కూడా మహిళలతో ఆ తరహా పాత్రలు చేయించలేదు. తాజాగా హిజ్రా పాత్రనే తన డ్రీమ్ రోల్ గా ప్రకటించారు వెర్సటైల్ నటి శోభన.
ఆయన నటిస్తే స్వాగతించారుగా:
ఇలాంటి పాత్రలో నటించడానికి ఎంత మాత్రం ఆలోచించచని..తన డ్రీమ్ రోల్ గా ఆ పాత్రను భావిస్తు న్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయంపై కొంత మంది దర్శకులతో కూడా మాట్లాడినట్లు గుర్తు చేసుకు న్నారు. అయితే ఆ దర్శకులు కూడా తనని అలాంటి పాత్రలో చూడాలని అనుకోవడం లేదని అభిప్రా యపడి నట్లు తెలిపారు. ప్రేక్షకులు ఎంతమాత్రం తనని హిజ్రా పాత్రలో స్వాగతించరని వారు చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు.ఈ నేపథ్యంలో శోభన వెంటనే ఇదే హిజ్రా పాత్రలో మమ్ముట్టి నటిస్తే ప్రేక్షకులు స్వాగతిం చలేదా? అని ప్రశ్నించినట్లు తెలిపారు.
ఛాన్స్ రాకపోవడంతో అసంతృప్తిగా:
ఇలాంటి పాత్రలు పోషించడం ఏవరికైనా సవాల్ తో కూడిన పనిగా పేర్కొన్నారు. ఇలాంటి పాత్రతో ఏ దర్శకుడు అప్రోచ్ అయినా పోషించడానికి సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. నటిగా ఎలాంటి పాత్రలైనా పోషించాలని...పాత్రను చిన్న చూపుగా చూడాల్సిన పనిలేదన్నారు. అన్ని రకాల పాత్రలు పోషించి నప్పుడే పరిపూర్ణ నటిగా మారుతామన్నారు. తన కెరీర్ లో ఇప్పటి వరకూ ఎన్నో పాత్రలు పోషించినా? హిజ్రా పాత్ర పోషించలేదు అన్న అసంతృప్తి ఉన్నట్లు తెలిపారు.
ఛాన్స్ తీసుకోని సీనియర్:
మరి శోభన కోరుకుంటున్నట్లు ఆ పాత్రలో ఆమెను ఏ దర్శకుడు చూపిస్తాడో చూడాలి. ప్రస్తుతం శోభన మలయాళంలోనే సినిమాలు చేస్తున్నారు. అదీ మనసుకు బాగా నచ్చితే తప్ప ఏ చిత్రానికి కమిట్ అవ్వ డం లేదు. ఐదేళ్ల గ్యాప్ అనంతరం ఇటీవల రిలీజ్ అయిన `తుడరమ్` లో నటించారు. తెలుగులో గత ఏడాది రిలీజ్ అయిన `కల్కి 2898`లోనూ కనిపించారు. ఇందులో మారియమ్ పాత్ర పోషించారు. తెలుగు లో శోభన రెండు దశాబ్దాల తర్వాత చేసిన చిత్రమిదే. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా ఛాన్స్ తీసుకోలేదు.