ప్రభాస్ స్నేహితులు ఐదవ తరగతిలోనే చైన్ పట్టారా?
తాజాగా అలాంటి సన్నివేశాలు తాను చూసానం టూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ముందుకొచ్చారు.;
నాగార్జున కథానాయకుడిగా రాంగోపాల్ వర్మ దర్శకత్వలో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ హిట్ `శివ` రీ-రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. మళ్లీ 36 ఏళ్ల తర్వాత నెటి జనరేష్ యువత కోసం 4కె ఫార్మెట్ లో రిలీజ్ చేస్తున్నారు. రీ-రిలీజ్ లోనూ సినిమాపై మంచి అంచనాలున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే కనిపిస్తున్నాయి. నేటి యువత `శివ`కు కచ్చితంగా కనెటక్ట్ అవుతుందని భావిస్తున్నారు. మరి సోషల్ మీడియాలో దూసుకుపోతున్న యువత ఎంతగా కనెక్ట్ అవుతుంది? అన్నది రిలీజ్ తర్వాత మాట్లాడుదాం. అయితే ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్ మూవీ .
అందులో యాక్షన్ సన్నివేశాలు ఎప్పటికీ రీ క్రియేట్ చేయలేనివి. అందులో సైకిల్ చైన్ తెంపి నాగార్జున చేసే యాక్షన్ సీన్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అప్పటి వరకూ హీరోలు! యాక్షన్ అంటే రెగ్యులర్ సన్నివేశాలు చేసి చూపించారు. అవన్నీ రొటీన్ గా ఉండేవి. వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్లు ఎన్నో సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చేసారు. కానీ నాగార్జున ఒక్క సైకిల్ చైన్ తెంపి క్రెడిట్ కొట్టేసారు. యూత్ లో క్రేజీ స్టార్ గా మారిపోయారు. కాలేజీ కుర్రాళ్ల అభిమాన హీరోగా ట్రెండ్ సృష్టించారు. ఇప్పుడు హీరోలగా రాజ్యమేలుతున్న వారంతా? అప్పుడు `శివ`లో నాగార్జునను చూసి ఆయనలా ఫీలయ్యేవారు.
కాలేజీ వార్ లో సైకిల్ తెంపిన స్టార్లు ఎంత మంది ఉండే ఉంటారు. తాజాగా అలాంటి సన్నివేశాలు తాను చూసానం టూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ముందుకొచ్చారు. ప్రభాస్ అప్పుడు ఐదవ తరగతి చదువుతోన్న రోజులవి. అప్పుడే `శివ` రిలీజ్ అవ్వడంతో? తమలో సైతం అందులో యాక్షన్ సన్నివేశాలు కాక పుట్టించాయన్నారు.తాను సైకిల్ చైన్ తెంపకపోయినా? మెడలో వేసుకుని తిరగకపోకపోయినా? తన స్నేహితులు మాత్రం ఆ స్టైల్ స్వాగ్ చూపించేవారన్నారు. తన జీవితంలోనే అతి పెద్ద ఇంపాక్ట్ ఉన్న మూవీగా `శివ`ని పేర్కొన్నారు.
ఐదవ తరగతి చదువుతోన్న సమయంలో ప్రభాస్ డాడ్ దేవి థియేటర్లో ఆ సినిమా చూపించినట్లు తెలిపారు. ఫస్ట్ షాట్ లో నే స్మోక్ కెమెరా మీదకు రాగానే ఇదేం? సినిమారా బాబు అనుకున్నానన్నారు. ఆ వయసులో తన పై అంత ఇపాక్ట్ చూపించిందంటే? మిగతా వాళ్ల పరిస్థితి ఏంటో? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇంకా ఈ సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు ఇంకా వారం రోజులు సమయం ఉండటంతో మరింత మంది స్టార్లు స్పందించే అవకాశం ఉంది.