• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శంకర్ తో మెగా ట్రబుల్స్.....

శంకర్ తో మెగా ట్రబుల్స్.. అన్నీ ఇన్ని కావు!

| అయితే గేమ్ చేంజర్ షూటింగ్ వాయిదా పడటంతో ఆ ఇంపాక్ట్ బుచ్చిబాబు సినిమా మీద పడింది. జూన్ నెలలోనే RC 16 మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే అవకాశం ఉందంట.

By - Tupaki Desk
Update: 2024-04-04 04:02 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏ ముహూర్తాన గేమ్ చేంజర్ స్టార్ట్ చేసాడో కానీ ఈ సినిమా షూటింగ్ రెండేళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇండియన్ 2 షూటింగ్ ఆగిపోవడంతో శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ స్టార్ట్ చేశాడు. దిల్ రాజు భారీ బడ్జెట్ పెట్టడానికి ముందుకొచ్చాడు. అయితే ఈ మూవీ స్టార్ట్ చేసిన కొన్ని నెలల్లోనే ఇండియన్ 2 సినిమా విషయంలో నిర్మాతలు, డైరెక్టర్ మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు తొలగిపోయాయి.

దీంతో ఆ సినిమా పెండింగ్ షూటింగ్ కూడా శంకర్ స్టార్ట్ చేశాడు. దిల్ రాజు, రామ్ చరణ్ ల నుంచి అభ్యంతరం లేకపోవడంతో రెండు సినిమాలు ఏక కాలంలో బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ వేసుకొని శంకర్ చేయడం మొదలు పెట్టాడు. ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయిస్తున్నాడు. అయితే గేమ్ చేంజర్ మూవీ మాత్రం ఇప్పటికి షూటింగ్ దశలోనే ఉంది.

ఈ సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయ్యి రెండేళ్లు అవుతుంది. ఈ ఒక్క ప్రాజెక్ట్ కారణంగా రామ్ చరణ్ ఇతర ప్లానింగ్స్ అన్ని వెనక్కి వెళ్లిపోయాయి. ఏప్రిల్ ఆఖరుకి గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని, ప్యాకప్ చెప్పేస్తారని అందరూ భావించారు. అయితే శంకర్ ఇండియన్ 2 మూవీని రిలీజ్ కి రెడీ చేస్తోన్న నేపథ్యంలో గేమ్ చేంజర్ షూటింగ్ మరింత ఆలస్యం కాబోతోందంట.

జూన్ నాటికి గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందంట. గేమ్ చేంజర్ లేట్ కావడంతో బుచ్చిబాబు దర్శకత్వంలో మొదలుపెట్టిన RC16 మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుందంట. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని బుచ్చిబాబు భావించారు. అయితే గేమ్ చేంజర్ షూటింగ్ వాయిదా పడటంతో ఆ ఇంపాక్ట్ బుచ్చిబాబు సినిమా మీద పడింది. జూన్ నెలలోనే RC 16 మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే అవకాశం ఉందంట. బుచ్చిబాబు ఇంకో రెండు నెలలు ఈ సినిమా కోసం ఎదురుచూడాల్సిందే.

ఏది ఏమైనా ఎప్పుడో పూర్తి చేయాల్సిన గేమ్ చేంజర్ ఆలస్యం కారణంగా రామ్ చరణ్ ప్లానింగ్స్ అన్ని బెడిసికొడుతున్నాయి. ఏడాదికి కనీసం రెండు సినిమాలు ప్రేక్షకులకి అందివ్వాలనేది రామ్ చరణ్ ప్లాన్. అయితే గేమ్ చేంజర్ అతని ప్లానింగ్స్ కి అవాంతరాలు కల్పిస్తూనే ఉంది. మరో వైపు గేమ్ చేంజర్ రిలీజ్ పైన కూడా ఇప్పటి వరకు శంకర్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గ్లోబల్ స్టార్ అభిమానులు ఈ విషయంలో అయితే అస్సలు హ్యాపీగా లేరని సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్ధమవుతుంది.

Tags:    
  • Shankar 
  • Ramcharan 
  • Kiaraadvani 
  • Dilraju 
  • Gamechanger 
  • Movieshooting 
  • Indian2 
  • Rc16 
  • Buchibabu 

Similar News

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

Copyright @2026

Powered by Blink CMS