5 కోట్లు దాటేసిన 'శంబాల'.. బాక్సాఫీస్ దగ్గర ఆది జోరు!

యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. రొటీన్ మాస్ మసాలా కథలకు దూరంగా, 'శంబాల' అనే మిస్టిక్ థ్రిల్లర్ తో వచ్చి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.;

Update: 2025-12-27 10:13 GMT

యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. రొటీన్ మాస్ మసాలా కథలకు దూరంగా, 'శంబాల' అనే మిస్టిక్ థ్రిల్లర్ తో వచ్చి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. విభిన్నమైన కథాంశం, ఉల్క పడటం అనే కొత్త పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో థియేటర్ల దగ్గర సందడి కనిపిస్తోంది.



 


సాధారణంగా చిన్న సినిమాలకు మౌత్ టాక్ చాలా ముఖ్యం. 'శంబాల' విషయంలో అదే మ్యాజిక్ జరుగుతోంది. సినిమా బాగుందనే మాట ఒకరి నుంచి ఒకరికి పాకడంతో, రెండవ రోజు బుకింగ్స్ బాగా పెరిగాయి. కేవలం థ్రిల్లర్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, కథలో ఉన్న ఎమోషన్ కూడా వర్కవుట్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

సినిమాలో ఆది సాయికుమార్ నటన చాలా సెటిల్డ్ గా ఉండటం, మేకింగ్ క్వాలిటీ రిచ్ గా ఉండటం సినిమాకు ప్లస్ అయ్యింది. దర్శకుడు యుగంధర్ ముని ఎంచుకున్న పాయింట్, దాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్స్, సాయికుమార్ వాయిస్ ఓవర్ సినిమా స్థాయిని పెంచాయని ఆడియెన్స్ అంటున్నారు. అందుకే ఎలాంటి భారీ ప్రచార ఆర్భాటాలు లేకపోయినా జనం థియేటర్లకు వస్తున్నారు.

బాక్సాఫీస్ నంబర్స్ విషయానికి వస్తే, ఆది కెరీర్ లోనే బెస్ట్ ఫిగర్స్ నమోదవుతున్నాయి. సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేస్తూ చిత్ర బృందం లేటెస్ట్ గా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రకారం 'శంబాల' సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 5.4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక టైర్ 2 హీరో సినిమాకు, కేవలం రెండు రోజుల్లోనే ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది నిజంగా గొప్ప విషయం.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, వీకెండ్ అడ్వాంటేజ్ కూడా తోడవడంతో ఈ నంబర్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్ లో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం 'శంబాల'కు బాగా కలిసొచ్చింది. లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి, ఇప్పటికే రికవరీ పరంగా నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆదికి ఈ సినిమా కమర్షియల్ గా మంచి బూస్ట్ ఇచ్చినట్లే. డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తే ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని 'శంబాల' మరోసారి నిరూపించింది. మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లు పెరగడం సినిమా స్టామినాను చూపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే, లాంగ్ రన్ లో ఈ సినిమా మంచి లాభాలు తెచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News