మూతి, ముఖం వాచేలా గుద్దుకున్న స్టార్లు
ఈ మూడు పాత్రలను బేస్ చేసుకుని తెరకెక్కించిన ఓ యాడ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ మూడు పాత్రలను మించిన నాటకీయతో ఈ యాడ్ లో కనిపిస్తుంది.;
బాలీవుడ్ లో ఆ ద్వయం ఇంకా చేతులు కలపలేదు. `ధూమ్ 4` లో భాగమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ అందులో వాస్తవం ఎంతో తెలియదు. అది జరిగినా జరగకపోయినా? ఆ ద్వయం మాత్రం ఓ యాడ్ కోసం పని చేయడం ఇంట్రెస్టింగ్. వాళ్లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా జత కట్టింది. ఏంటా విశేషాలు అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. `జవాన్` చిత్రంలో షారుక్ ఖాన్ విక్రమ్ రాథోర్ గా ఏ రేంజ్ లో అలరించాడో తెలిసిందే. అలాగే `బ్రహ్మస్త్ర` సినిమాలో రణబీర్ కపూర్ శివ పాత్రతో అంతే ఆకట్టుకున్నాడు. `రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ`లో అలియాభట్ నటన అంతే రక్తి కట్టిస్తుంది.
ఈ మూడు పాత్రలను బేస్ చేసుకుని తెరకెక్కించిన ఓ యాడ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ మూడు పాత్రలను మించిన నాటకీయతో ఈ యాడ్ లో కనిపిస్తుంది. షారుఖ్ తన `జవాన్` పాత్ర విక్రమ్ రాథోర్‌గా, గ్రే హెయిర్ లుక్ తో తన స్వాగ్‌లోకి తీసుకెళ్లాడు. రణబీర్ కపూర్ `బ్రహ్మాస్త్ర` లో శివ వైబ్ ను తీసుకొచ్చాడు. ఆలియా భట్ `రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ`లోని రాణీగా అంతే ఆకర్షణతో ఆకట్టుకుంది. ముగ్గురు రుంగ్టా స్టీల్స్ బ్రాండ్ ప్రకటనలో మెప్పించని వైనం అది.
తమ బ్రాండ్ స్టీల్ ఎంత స్ట్రాంగ్ అన్నది రణబీర్-షారుక్ మధ్య భీకర పోరుతో చెప్పకనే చెప్పారు. తలకాయలు స్టీల్ కేసి బాదుతుంటే టపీ టపీ మని వచ్చే సౌండింగ్ చెవులకు కిక్ నిస్తుంది. మధ్యలో అలియాభట్ ఎంట్రీతో? ఆ యుద్ద వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం రక్తి కట్టిస్తుంది. ఇదంతా చూసి కొన్ని క్షణాలపాటు ఇదే టీజరా? ట్రైలరా? అన్న సందేహం రాకమానదు. అంత రియలిస్టిక్ గా యాడ్ ని సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కించాడు.
`రణ్‌బీర్, షారుఖ్ ముఖంపై పంచ్ విసరడం తొలిషాట్. `సర్ బచాకే, విక్రమ్ రాథోర్. కహీ ఫిర్ సే నా భూల్ జావో ఆప్ కౌన్ హో (తల జాగ్రత్త విక్రమ్ రాథోర్. నువ్వు ఎవరో మళ్లీ మర్చిపోకు), అని రణ్‌బీర్ అనగా షారుఖ్ జవాన్ అవతారాన్ని ఆటపట్టిస్తూ చమత్కరిస్తాడు. ప్రతిగా షారుక్ పంచ్ విసరి..నాలుగు గుద్దులు గుద్దడంతో సీన్ మరింత వేడెక్కుతుంది. అదే సమయంలో రాణి అలియాభట్ ఎంట్రీ ఇస్తుంది. తన వంటగదిలో వస్తువులను పగలగొ ట్టకుండా ఆపుతుంది. అటుపై ఆ ఇద్దరూ ఆలియా వైపు తిరిగి చూసి ఎక్కడ? తమ పోరాటాన్ని తిరిగి ప్రారంభించాలో అడగడంతో యాడ్ పూర్తవుతుంది. ప్రస్తుతం ఈయాడ్ నెట్టింట వైరల్ గా మారింది. సినిమా టీజర్, ట్రైలర్ తరహాలో ప్రేక్షకుల్ని అలరిస్తుంది.