అన‌వ‌స‌రంగా లీకులిచ్చిన సూప‌ర్‌స్టార్

తాను న‌టించే సినిమా ఫ‌లానా విధంగా ఉంటుంది! అని ముందే హింట్ ఇవ్వ‌డం తెలివైన ప‌నే. కొన్నిసార్లు ముందే స‌బ్జెక్ట్ ఏంటి? అనేదానిపై అవ‌గాహ‌న వ‌చ్చేస్తే, అభిమానులకు థియేట‌ర్ల‌కు వెళ్లాక అన‌వ‌స‌ర క‌న్ఫ్యూజ‌న్ ఉండ‌దు.;

Update: 2025-09-01 03:34 GMT

తాను న‌టించే సినిమా ఫ‌లానా విధంగా ఉంటుంది! అని ముందే హింట్ ఇవ్వ‌డం తెలివైన ప‌నే. కొన్నిసార్లు ముందే స‌బ్జెక్ట్ ఏంటి? అనేదానిపై అవ‌గాహ‌న వ‌చ్చేస్తే, అభిమానులకు థియేట‌ర్ల‌కు వెళ్లాక అన‌వ‌స‌ర క‌న్ఫ్యూజ‌న్ ఉండ‌దు. ప్ర‌తిదానికి ప్రిపేర్డ్ గా ఉంటారు. ఇప్పుడు సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్ త‌న త‌దుప‌రి సినిమా గురించి అలాంటి హింట్స్ ఇస్తున్నారు.

త‌న కుమార్తె సుహానా ఖాన్ తో క‌లిసి మొద‌టిసారి న‌టిస్తున్న షారూఖ్ `కింగ్` మూవీ కోసం చాలా హార్డ్ గా శ్ర‌మిస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి చిన్న‌పాటి లీకులు బయ‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్పుడు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఒక‌ ఎర్ర కిరీటం చిహ్నంతో కూడిన టీ షర్టుతో అంద‌మైన‌ పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అభిమానులను టీజ్ చేసాడు. ఆన్‌లైన్‌లో ఇది వేగంగా వైర‌ల్ అయింది. దీనికి కార‌ణం ఈ పోస్ట్ కు జాన్ విక్ నేపథ్య సంగీతాన్ని జోడించడ‌మే. ఈ సంగీతం విన‌గానే.... కీనూ రీవ్స్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ సిరీస్ స్ఫూర్తితో కింగ్ మూవీ రూపొందుతోందా? అనే సందేహాల‌ను రాజేసారు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ఖాన్ ను కీనూ రీవ్స్ రేంజులో చూడ‌గ‌ల‌మ‌న్న‌మాట‌.

`కింగ్` క‌థ త‌న కుమార్తెకు ర‌క్ష‌కుడిగా మారే ఒక ప్ర‌మాద‌క‌ర గ్యాంగ్ స్ట‌ర్ క‌థ‌. త‌న‌ గారాల ప‌ట్టీని కిడ్నాప్ చేయాల‌ని టార్గెట్ చేసే గ్యాంగ్ ఎంత పెద్ద‌ది అయినా ఢీకొడ‌తాడు. ఇందులో షారూఖ్ పాత్ర‌తో పాటు సుహానా పాత్ర‌కు న‌ట‌న‌కు ఆస్కారం ఉంటుంద‌ని తెలిసింది. ప‌ఠాన్ త‌ర్వాత‌ సిద్ధార్థ్ ఆనంద్ షారూఖ్ కి మ‌రో గ్రాండ్ స‌క్సెస్ ఇవ్వాల‌ని త‌పిస్తున్నాడు. అందుకే కింగ్ మూవీ ఖాన్ కెరీర్ బెస్ట్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News