షారూఖ్ ఎందుకు ధనవంతుడో ఇప్పటికైనా తెలిసిందా?
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాల్లో సెలబ్రిటీలపై చాలా సిల్లీ డిబేట్లు ఆశ్చర్యపరుస్తున్నాయి.;
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాల్లో సెలబ్రిటీలపై చాలా సిల్లీ డిబేట్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. కింగ్ ఖాన్ షారూఖ్ అంతటివాడు, వేల కోట్లు సంపాదించిన తర్వాత కూడా ఇంకా ధనవంతులు పెళ్లిలో ఎందుకు డ్యాన్సులు చేయాలి? అంటూ లాజిక్ లేని ప్రశ్నలు అడుగుతున్నారు. మొన్నటికి మొన్న ఒక ధనికుడి కుమార్తె పెళ్లిలో షారూఖ్ డబ్బుల కోసం డ్యాన్సులు చేసాడని కాస్త నీచంగానే మాట్లాడుతున్నారు.
నిజానికి షారూఖ్ లాంటి అగ్ర కథానాయకుడు, 12,500 కోట్ల ఆస్తులకు అధిపతి ఇలా ధనికుల పెళ్లిళ్లలో డ్యాన్సులు చేయాల్సిన అవసరం ఏమిటి? అతడు మరో రాహుల్ రాయ్ కాదు కదా? అంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే కింగ్ ఖాన్ నేపథ్యం గురించి తెలిసిన వారు కానీ, అతడి పట్టుదల గురించి తెలిసిన వారు కానీ, డబ్బు విలువ గురించి అతడు తెలుసుకున్నది ఏమిటో తెలిసిన ఎవరైనా ఇలాంటి చెత్త ప్రశ్న అడగరు.
డబ్బు టు ద పవరాఫ్ డబ్బు. డబ్బు డబ్బును పెడుతుంది. సెలబ్రిటీ హోదా డబ్బును సృష్టిస్తుంది. అలాగే పెళ్లిళ్లలో డ్యాన్సులు చేసి అహూతులకు వినోదం పంచడం తప్పు ఎలా అవుతుంది. తమ అభిమాన తారను దగ్గరగా చూసుకోవడానికి పెళ్లి వేడుక ప్రజలకు ఒక వేదిక అవ్వొచ్చు కదా? అయినా స్టార్లు ఉన్నది కేవలం ప్రజలకు వినోదం పంచేందుకు మాత్రమే. స్టేజీ ఎక్కిన రెండు మూడు గంటలలోనే 4-5 కోట్లు సంపాదించుకునే అవకాశం ఎంతమందికి ఉంది? చాలా సులువుగా ఆదాయాన్ని ఆర్జించడానికి ఉన్న అవకాశాన్ని వదులుకోవాలా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు రెండో వైపు నుంచి కూడా ఉన్నాయి కదా? కనీస ఇంగితం లేకుండా, షారూఖ్ ఖాన్ ధనికుల పెళ్లిలో డ్యాన్సులు చేస్తున్నాడు.. డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నాడు! అంటూ మాట్లాడటం సబబేనా? 5 కోట్లు సంపాదించడానికి ఒక సామాన్య ఉద్యోగికి లేదా మధ్యతరగతి ప్రజలకు ఒక జీవితం సరిపోతుందా? అనేది కూడా ఇక్కడ పరిగణించాలి.
షారూఖ్ ఒకప్పుడు సరైన వసతులు లేని పేదరికం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుని అంచెలంచెలుగా ఎదిగిన స్టార్. అతడు పుట్టుకతోనే సిల్వర్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టలేదు. అందువల్ల డబ్బు కష్టం తెలిసినవాడు. ఇప్పుడు సునాయాసంగా గంటలోనే కోట్లు సంపాదించుకునే అవకాశం వస్తే కాదని అనగలడా?
చాలామంది సంపాదించడం తెలియనివాళ్లు కామెంట్లు చేస్తే అది పట్టించుకోవాల్సిన పని లేదు. ఒక అభిమాని చాలా సింపుల్ గా ``అందుకే అతను అత్యంత ధనవంతుడు అయ్యాడు`` అని క్యాప్షన్ ఇచ్చాడు. షారూఖ్ తన పెళ్లిలో డ్యాన్సులు చేయాలని వధువు కోరుకుంది అంటే అతడిని మించిన ధనికురాలు అని దాని అర్థం. ఖాన్ ఈ పెళ్లిలో డ్యాన్సులు చేస్తే తప్పేమీ లేదని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు.
ఆమె జస్టిన్ బీబర్ కోసం అడిగింది.. కానీ SRK వచ్చాడు! అందుకే ఆమె అతడితో నృత్యం చేయలేదు.. అని కూడా ఒక వ్యక్తి సరదాగా కామెంట్ చేసారు. ప్రకటనలు, నృత్యాలతోనే అతడు టామ్ క్రూజ్ కంటే ధనవంతుడయ్యాడని ఒక అభిమాని గుర్తు చేయడం విశేషం.