వరుస రిలీజులతో బిజీబిజీగా సెప్టెంబర్
వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ ఇలా వరుసగా సీజన్లు ఉండటంతో చాలా సినిమాలు రిలీజవుతూ ఉంటాయి.;
ప్రతీ ఇయర్ సెప్టెంబర్ నుంచి ఇయర్ ఎండింగ్ సినిమాల హడావిడి మొదలవుతుంది. వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ ఇలా వరుసగా సీజన్లు ఉండటంతో చాలా సినిమాలు రిలీజవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్, అక్టోబర్, దీపావళి వరకు మంచి రిలీజులున్నాయి. అందులో భాగంగానే సెప్టెంబర్ 5న అనుష్క నటించిన ఘాటి మరియు శివ కార్తికేయన్ డబ్బింగ్ మూవీ మదరాసి రిలీజ్ కానున్నాయి.
సెప్టెంబర్ 12న కిష్కింధపురి, కాంత
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఘాటి ఈసారి తప్పకుండా అదే డేట్ కు రానున్నట్టు తెలుస్తోంది. మదరాసి సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి. ఇక అదేరోజున ఈటీవీ విన్ ఒరిజినల్ సినిమాగా వస్తున్న లిటిల్ హార్ట్స్ కూడా రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ మంచి ఇంట్రెస్ట్ ను కలిగిస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 12న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి, దుల్కర్ సల్మాన్ కాంత సినిమాతో పాటూ విజయ్ ఆంటోనీ డబ్బింగ్ సినిమా భద్రకాళి కూడా రిలీజ్ కానున్నాయి.
వీటిలో కిష్కింధపురి హార్రర్ డ్రామా గా రానుంటే కాంత పీరియాడికల్ డ్రామాగా రానుంది. ఈ సినిమాలు ఇప్పటికే ప్రమోషనల్ దశలో ఉన్నాయి. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వల్ల లేట్ అవుతున్న తేజా సజ్జా మిరాయ్ మూవీ పాన్ ఇండియాలో థియేటర్ల అందుబాటును బట్టి సెప్టెంబర్ 12 లేదా సెప్టెంబర్ 19న రిలీజయ్యే ఛాన్సుంది. ఆగస్ట్ నెలాఖరులో రిలీజ్ కానున్న రవితేజ మాస్ జాతర కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల లేటవుతోంది. ఈ సినిమా కూడా సెప్టెంబర్ నెలాఖరున లేదంటే అక్టోబర్ లో రిలీజయ్యే ఛాన్సుంది.
సెప్టెంబర్ 25న ఎన్నో అంచనాలతో వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజి రిలీజ్ కానుంది. బాలకృష్ణ అఖండ2 కూడా అదే రోజున రావాలి కానీ ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వల్ల వాయిదా పడుతుందంటున్నారు. మొత్తానికి సెప్టెంబర్ నెల పలు సినిమాలతో హంగామా చేయడానికి రెడీ అయింది. మరి వీటిలో ఏ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను అందుకుంటాయో చూడాలి.