ఆనంద్ చిత్రాన్ని క‌మ్ములా డబ్బులిచ్చి ఆడించాడా!

రాజా, క‌మ‌లిని ముఖ‌ర్జీ జంట‌గా శేఖ‌ర్ క‌మ్ములా తెర‌కెక్కించిన 'ఆనంద్' ఓ బ్యూటీఫుల్ ల‌వ్ స్టోరీ. శేఖ‌ర్ క‌మ్ములాకు డైరెక్ట‌ర్ గా రెండ‌వ సినిమా. అప్ప‌టికే 'డాల‌ర్స్ డ్రీమ్స్' అని ఓ చిత్రం చేసారు.;

Update: 2025-06-21 11:30 GMT
ఆనంద్ చిత్రాన్ని క‌మ్ములా డబ్బులిచ్చి ఆడించాడా!

రాజా, క‌మ‌లిని ముఖ‌ర్జీ జంట‌గా శేఖ‌ర్ క‌మ్ములా తెర‌కెక్కించిన 'ఆనంద్' ఓ బ్యూటీఫుల్ ల‌వ్ స్టోరీ. శేఖ‌ర్ క‌మ్ములాకు డైరెక్ట‌ర్ గా రెండ‌వ సినిమా. అప్ప‌టికే 'డాల‌ర్స్ డ్రీమ్స్' అని ఓ చిత్రం చేసారు. కానీ పెద్ద‌గా వెలుగులోకి రాలేదు. అయినా 'ఆనంద్' రూపంలో మ‌రో డిఫ‌రెంట్ అటెంప్ట్ చేసాడు క‌మ్ములా. ఈ సినిమా క‌మ్ములాకి డైరెక్ట‌ర్ గా మంచి గుర్తింపును పేరు తెచ్చి పెట్టింది. టాలీవుడ్ కి ఓ డిఫ‌రెంట్ లో చిత్రాల ద‌ర్శ‌కుడు దొరికాడ‌నిపించింది.

అప్ప‌టికే రెగ్యుల‌ర్ ల‌వ్ స్టోరీలు చూసి విసుగు చెందిన ప్రేక్ష‌కుల‌కు ఆనంద్ నిజంగా మంచి కాఫీ లాంటి చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా స‌క్సెస్ అన్న‌ది రిలీజ్ అయిన రెండు వారాల త‌ర్వాత జ‌రిగింది? అన్న విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన కొత్త‌లో థియేట‌ర్ కు జ‌నాలు రాలేదట‌. దీంతో శేఖ‌ర్ క‌మ్ములా ఎదురు డబ్బులిచ్చి థియేట‌ర్లో ఆడించారట‌.

ఆ త‌ర్వాత సినిమాకు మంచి టాక్ రావ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్లు ముందుకు రావ‌డంతో ఎదురైన ఇబ్బం దుల‌న్ని తొలిగిపోయిన‌ట్లుగా క‌మ్ములా గుర్తు చేసుకున్నారు. అదే బ్రాండ్ తో గోదావ‌రి చిత్రాన్ని తెర‌కె క్కించారు. ఈ సినిమా మాత్రం ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. అటుపై కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో 'హ్యాపీడేస్' తెర‌కెక్కించారు. ఈసినిమాతో క‌మ్ములా కెరీరే మారిపోయింది. డైరెక్ట‌ర్ గా త‌దుప‌రి స్థానంలో కూర్చోబెట్టింది.

అటుపై ద‌గ్గుబాటి వార‌సుడు రానా ప‌రిచ‌యం చేస్తూ 'లీడ‌ర్' చేసారు. ఈ సినిమా తో క‌మ్ములా బ్రాండ్ ఇమేజ్ రెట్టింపు అయింది. అవినీతి రాజ‌కీయ వ్వ‌వ‌స్థ‌పై చేసిన లీడ‌ర్ అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. అలా మొద‌లైన క‌మ్ములా కెరీర్ నేడు టాప్ లో కొన‌సాగుతుంది. తాజాగా ఆయ‌న డైరెక్ట్ చేసిన కుబేర కూడా గ్రాండ్ స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News