జీవితంలో ముందుకెళ్లాలంటే అది కూడా ముఖ్యమే!

చాలా మంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో ఉండే మానసిక ఒత్తిళ్ల గురించి అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలలో బయటపెడుతూ ఉంటారు.;

Update: 2025-10-24 05:46 GMT

చాలా మంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో ఉండే మానసిక ఒత్తిళ్ల గురించి అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలలో బయటపెడుతూ ఉంటారు. అలా తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా రాణిస్తున్న సారా అలీ ఖాన్ కూడా మానసిక శ్రేయస్సు గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "బాలీవుడ్ లో ఉండే ఒత్తిళ్ళ మధ్య మనసుని జాగ్రత్తగా చూసుకోవడం,శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం అని నేను గ్రహించారు.. ఇప్పటి జనరేషన్ వారి మానసిక శ్రేయస్సు గురించి మాట్లాడడం చాలా సంతోషకరం. కానీ వాళ్లు ట్రీట్మెంట్ తీసుకోవడానికి మాత్రం సంకోచిస్తున్నారు.. ఈ అంతరాన్ని తగ్గించడం కోసం మనం శారీరక ఆరోగ్యం గురించి మాట్లాడినట్లుగానే మానసిక శ్రేయస్సు గురించి కూడా మాట్లాడుకోవాలి.

మానసిక శ్రేయస్సు గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఉదాహరణకు విద్య ద్వారా అవగాహన కలిగించే నాయకత్వాన్ని వహించడం చాలా ముఖ్యం. ప్రజా ప్రతినిధులు,కార్యాలయాలు, కుటుంబాలు ఇలాంటి మానసిక చికిత్స గురించి బహిరంగంగా మాట్లాడినప్పుడు వారిలో ఉన్న భయం తొలగించడానికి సహాయపడుతుంది. అయితే సహాయం కోరడం అనేది బలానికి సంకేతమే కానీ బలహీనత కాదు అని తెలుసుకోవాలి. మనం దానిని ఎంతగా బలపరుస్తామో మానసిక ఆరోగ్యానికి అంత దగ్గర అవుతాం.. ఫీల్ గుడ్ విత్ ఫియామా మెంటల్ వెల్ బీయింగ్ సర్వే ప్రకారం..55 శాతం మంది ఇండియన్స్ ఇప్పటికీ ట్రీట్మెంట్ అనేది కేవలం బలహీనుల కోసమే అని అనుకుంటున్నారు. ఇక నేను నా వేగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మానసిక శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాను.

నాకు మానసిక శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న క్షణం నుండి నేను వేగాన్ని తగ్గించుకోవాలని, నన్ను నేను చూసుకోవాలని, నా శరీరం పట్ల శ్రద్ధను కలిగి ఉండాలని భావించాను. నిజాయితీగా చెప్పాలంటే.. శరీరాన్ని ఎంత శ్రద్ధగా అయితే చూసుకుంటామో మనసుని కూడా అంతే శ్రద్ధగా చూసుకోవాలి. ఇక దీని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువ తెలుసుకుంటాం.. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా చూసుకోవడం కంటే శ్రేయస్సు మరొకటి లేదు అని నేను భావిస్తాను.ఇక గతంలో నేను నా చుట్టూ జరుగుతున్న ప్రతి ఒక్క విషయంలో అయోమయపడేదాన్ని. ఆ సమయంలో ఎక్కువగా అమ్మతో గడిపే దాన్ని. అలాంటి చిన్న చిన్న విషయాలే నా లైఫ్ ని నేను తిరిగి పొందేలా చేశాయి. అందుకే జీవితంలో ముందుకు వెళ్లాలి అంటే శారీరక చికిత్సతో పాటు మానసిక చికిత్స కూడా ముఖ్యమే అని నేను భావిస్తాను " అంటూ సారా అలీ ఖాన్ మానసిక ఆరోగ్యం గురించి తాజా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

సారా అలీ ఖాన్ సినిమాల విషయం చూసుకుంటే.. ఈ హీరోయిన్ 2018లో దివంగత నటుడు అయినటువంటి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన కేదారనాథ్ మూవీతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత సింబా, అత్రంగి రే, కూలి నెంబర్ 1, జర హట్ కే జరా బచ్కే వంటి సినిమాల్లో నటించింది.

Tags:    

Similar News