• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల్లు అర్జున్‌ అంటే ఎంత...

అల్లు అర్జున్‌ అంటే ఎంత ఇష్టమంటే...!

| బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు

By - Tupaki Desk
Update: 2023-07-26 05:09 GMT

సీనియర్ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ కమ్ కమెడియన్‌ కమ్ విలన్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు ఇప్పటికే హీరోగా పరిచయం అయ్యాడు. ఓ పిట్ట కథ సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంజయ్ రావు మొదటి ప్రయత్నంలో విఫలం అయ్యాడు. అయినా కూడా తనకు ఉన్న బ్యాక్ గ్రౌండ్.. తన పట్టుదలతో సినిమా ఇండస్ట్రీలో కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

తాజాగా సంజయ్ రావు స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. పవన్ కళ్యాణ్‌ 'బ్రో' సినిమా విడుదల అయిన తర్వాత రోజు అంటే జులై 29 వ తారీకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తో సంజయ్‌ రావు హీరోగా మంచి మార్కులు దక్కించుకోవడం మాత్రమే కాకుండా ఓ మంచి కమర్షియల్ బ్రేక్ ను కూడా దక్కించుకుంటాడని బ్రహ్మాజీ నమ్మకంగా కనిపిస్తున్నాడు.

బ్రహ్మాజీ తనకు ఉన్న పరిచయాలతో 'స్లమ్‌ డాగ్ హస్బెండ్' కి మంచి ప్రచారం చేయడంలో సఫలం అయ్యాడు. కాస్త విభిన్నంగా ఈ సినిమా ప్రమోషన్ చేశాడు అనడంలో సందేహం లేదు. ఇక తాజాగా సంజయ్‌ రావు ఒక ఇంటర్వ్యూలో తనకు అల్లు అర్జున్‌ పై ఉన్న అభిమానంను చూపించాడు. అల్లు అర్జున్‌ అంటే విపరీతమైన అభిమానం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

నాన్నను చూసి ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికి అల్లు అర్జున్ గారిని ఇన్సిపిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీలో కష్టపడుతాను అంటూ సంజయ్ రావు చెప్పుకొచ్చాడు. ఒక స్టార్‌ నిర్మాత తనయుడు అయినా కూడా అల్లు అర్జున్‌ ఎంతగా కష్టపడుతాడో నాకు తెలుసు. ఆయనకు ఈ స్టార్ డం అంత ఈజీగా రాలేదు. ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. బన్నీ కెరీర్‌ జర్నీ అంతా నాకు తెలుసు అన్నాడు.

బన్నీ ఆఫీస్ కు వెళ్లి అన్నకు ఇవ్వమని వాళ్ల అసిస్టెంట్ కు గిఫ్ట్‌ ఇచ్చి వచ్చాను. అన్నను వెళ్లి కలుస్తాను అన్నాడు. మా సినిమా ట్రైలర్ ను నాన్న చూపించినప్పుడు బన్నీ అన్న పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారట. పక్కనే ఉన్న ఫాహద్ ఫాసిల్ గారికి కూడా చూడమని చెప్పారట. నా సినిమా ట్రైలర్‌ బన్నీ అన్నకు నచ్చడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది అన్నాడు. మొత్తానికి చాలా మంది యంగ్ హీరోల మాదిరిగా సంజయ్ రావు కూడా అల్లు అర్జున్‌ ఫ్యాన్‌ జాబితాలో ఉన్నాడన్నమాట.

Tags:    
  • SanjayRao 
  • SlumDogHusbandMovie 
  • Brahmaji 
  • AlluArjun 
  • OoPittaKatha 
  • HeroSanjayRao 
  • Tollywood 
  • Pranavi 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS