విడాకుల గాసిప్‌లపై సంగీత ఘాటైన సమాధానం
ఇటీవల సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీ విడాకుల వార్తలు రోజుకొకటి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.;
ఇటీవల సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీ విడాకుల వార్తలు రోజుకొకటి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. పెద్ద హీరోలు, హీరోయిన్లు, దర్శకులు… విడాకుల ఆలోచనలో ఉన్నారనే గాసిప్స్ కారణం లేకుండా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ నటి సంగీత కూడా ఇదే వరుసలో నిలిచింది. తమిళ, తెలుగు సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న సంగీతపై ఇటీవల విడాకులు తీసుకోబోతుందనే వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె పేరు మారిందని, ఇప్పటికే కృష్ణ నుంచి విడిపోతుందన్న రూమర్లు విపరీతంగా స్ప్రెడ్ అయ్యాయి.
సినీ పరిశ్రమలో ఇటీవల విడాకుల నేపథ్యంలో పేరులో మార్పు తెచ్చుకోవడం కామన్ పాయింట్ గా మారింది. సినీ తారలు విడాకులు ప్రకటించకముందే తమ సోషల్ మీడియా అకౌంట్‌లో పేరు మార్చడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. సంగీత, తమిళ గాయకుడు క్రిష్ 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఇటీవల సంగీత తన ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘సంగీత క్రిష్’ పేరును ‘సంగీత’గా మార్చిందని వార్తలు వస్తుండటంతో, ఈ జంట కూడా త్వరలో విడాకులు తీసుకుంటుందన్న అనుమానాలు ఎక్కువయ్యాయి. వీరికి మధ్య మనస్పర్థలు వచ్చాయని, విడిపోతారన్న కథనాలు వెలువడ్డాయి.
ఈ ప్రచారాల నేపథ్యంలో సంగీత మొదటిసారి తన వ్యక్తిగత జీవితం గురించి క్లారిటీ ఇచ్చింది. ‘‘ఇది పూర్తిగా అబద్ధం. నేను మొదటి నుంచీ నా ఇన్‌స్టాగ్రామ్‌లో నా పేరును ‘సంగీత యాక్టర్’గానే ఉంచుతున్నాను. వాస్తవానికి అది ఇప్పటికీ అలాగే ఉంది. మా ఆయనతో కలిసి సంతోషంగా ఉన్నాను. అలాంటి ఊహాగానాలపై స్పందించాలని నాకు అనిపించదు. కానీ, గ్యాప్ లేకుండా ప్రచారం చేస్తుండటంతో రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది,’’ అంటూ ఆమె సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
ఈ వ్యాఖ్యలతో సంగీత తన పెళ్లి జీవితంలో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టంగా చెప్పేసింది. కొంతమంది వ్యక్తిగత విషయాలను ఊహించి రాయడం, సోషల్ మీడియాలో అతిగా స్పందించడం ఆమెను తీవ్రంగా బాధించిందని అభిప్రాయపడింది. గాసిప్ కేవలం సోషల్ మీడియాలోని ప్రచారమే తప్ప వాస్తవంలో ఏమీలేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం సంగీత, క్రిష్ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉన్నారని, వీరిమధ్య మనస్పర్థలు ఏవీ లేవని ఆమెను సన్నిహితులు కూడా వెల్లడిస్తున్నారు.
సంగీత కెరీర్ విషయానికి వస్తే.. ఆమెకు మంచి ప్రాజెక్టులు వరుసగా వస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ బాబుతో నటించిన ఆమె, త్వరలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న పరదా సినిమాలో కనిపించనుంది. కెరీర్‌లో కొత్త చాన్సులు రావడంతో సినిమాపై మళ్లీ ఫోకస్ పెట్టిన సంగీత, వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నట్టు చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.