అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న కిష్కింధపురి విలన్.. బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు ఈ మధ్య పాన్ ఇండియా చిత్రాలలో నటించడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు.;

Update: 2025-09-15 11:31 GMT

సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు ఈ మధ్య పాన్ ఇండియా చిత్రాలలో నటించడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. సొంత భాషా ఇండస్ట్రీలలో హీరోగా కనిపించిన వారు.. ఇతర భాషలలో పాత్ర డిమాండ్ చేస్తే విలన్ గా కూడా కనిపించడానికి సిద్ధమవుతున్నారు. అలా ఇప్పుడు తాజాగా కిష్కింధపురి చిత్రంలో విలన్ గా నటించి తన విచిత్రమైన రూపం, ఎక్స్ప్రెషన్స్ తో సినిమాని సక్సెస్ అయ్యేలా చేశారు. ఆయన ఎవరో కాదు నటుడు శాండీ మాస్టర్.

శాండీ మాస్టర్ ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా తన లుక్స్ తోనే భయపెట్టే అంత విలక్షణమైన నటుడుగా పేరు సంపాదించారు. దీంతో ఈయన ఎవరు ? ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈ నటుడు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

2005లో కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు శాండీ మాస్టర్. తెలుగులో ఓంకార హోస్ట్ గా చేసిన ఛాలెంజ్ రియాలిటీ షోలో డాన్స్ మాస్టర్ గా కూడా పనిచేశారు. తన టాలెంట్ తో రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమాలోని "మోనిక మోనిక" అనే పాటకు కూడా పూజ హెగ్డే తో పాటూ సౌబిన్ షాహిర్ తో స్టెప్పులు వేయించింది ఈయనే. ఈ చిత్రాలే కాకుండా తంగలాన్ , విక్రమ్, ఆవేశం తదితర సూపర్ హిట్ చిత్రాలకు కూడా పనిచేశారు శాండీ మాస్టర్.

శాండీ మాస్టర్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఈయన రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు..2009లో నటి కాజల్ పశుపతిని వివాహం చేసుకున్నప్పటికీ.. కేవలం మూడు సంవత్సరాలకే వీరిద్దరు విడిపోయారు. తిరిగి మళ్ళీ 2015లో సోషల్ మీడియా సెలబ్రిటీలలో ఒకరైన దొరతి స్లవియాని వివాహం చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. నటుడు శాండీ మలయాళ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాలలో నటిస్తున్నారు ముఖ్యంగా అనుష్క నటిస్తున్న కథనర్ చిత్రంతో పాటుగా మరికొన్ని సినిమాలలో నటిస్తున్నారు.

శాండీ డిమాండ్ ఎలా ఉందంటే ఒకవైపు కొరియోగ్రాఫర్ గా మరొకవైపు యాక్టర్ గా సినిమాలలో చేయించడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ' లోక చాప్టర్ వన్: చంద్ర ' సినిమాలో కూడా నటించారు. ఇందులో పోలీసు ఆఫీసర్ గా నటించి అదరగొట్టేశారు. అయితే ఇప్పటివరకు నటుడు శాండీ లిస్టులో ఒక్క ఫ్లాప్ కూడా లేదట.. మరి తెలుగులో నటించిన కిష్కింధపురి సినిమా వల్ల తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించే అవకాశాలు రావచ్చు అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి శాండీకి తెలుగులో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

Tags:    

Similar News