సందీప్ వంగా సినిమా కోసం 8 వసంతాలు హీరోయిన్

సందీప్ రెడ్డి వంగ గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేసిన ఆయన.. బాలీవుడ్ లోనూ సత్తా చాటాడు.;

Update: 2025-09-23 19:30 GMT

సందీప్ రెడ్డి వంగ గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేసిన ఆయన.. బాలీవుడ్ లోనూ సత్తా చాటాడు. తెలుగులో నేరుగా ఒక సినిమా చేస్తే, బాలీవుడ్ హీరోలతోనే రెండు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్లు కొట్టాడు. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పట్టాలెక్కకముందే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

అయితే తెలుగులో కొంతకాలంగా కొత్త పరంపర వచ్చింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు కేవలం సినిమాలు తెరకెక్కించడమే కాకుండా 24 క్రాఫ్ట్ల్ లో ఏదైనా ఒక రకంగా సినిమాలను అందిస్తున్నారు. కొంతమంది ఇతర డైరెక్టర్లకు కథ అందిస్తే, మరికొందరు సినిమాలు నిర్మిస్తున్నారు. ఇఫ్పుడు సందీప్ కూడా నిర్మాతగా మారారు. ఆయన ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్లే కాదు కాదు హీరోలు, నటీనటులు కూడా ప్రొడ్యూసర్ల అవతారమెత్తి మంచి సినిమాలు అందిస్తున్నారు.

ఇక్కడ సందీప్ నిర్మాతగా రూపొందిస్తున్న సినిమా గురించి లేటెస్ట్ అప్టేడ్ ఏంటంటే... 8 వసంతాలు ఫేమ్ సినిమా నటి అనంతిక సనిల్ కుమార్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇటీవల రిలీజైన ఈ 8 వసంతాలు సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీతో యువతను ఆకట్టుకుంది. ఇందులో అనంతిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.

మరోవైపు ఈ సినిమాలో యూట్యూబ్ స్టార్, మేమ్ ఫేమస్ సినిమా నటుడు సుమంత్ ప్రభాస్ హీరోగా సెలక్ట్ అయ్యాడు. సుమంత్ విషయానికొస్తే.. తాను యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ చేస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కాడు. చివరికి తానే సొంతంగా మేమ్ ఫేమస్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా తీసి తన సత్తా చాటుకున్నాడు. ఈ సినిమాకు యూత్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే సందీప్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగాడు. అందుకేనేమో తాను నిర్మించే సినిమాలో కూడా సొంతంగా ఎదుగుతున్న వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఈ క్రమంలోనే బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన సుమంత్ ను హీరోగా ఎంపిక చేయడం దానికి సంకేతమే. సినిమాలో ఇంకా కొత్త నటీనటులే ఉండే ఛాన్స్ ఉంది. కాగా ఈ సినిమాకు హీరో హీరోయిన్లు ఫిక్స్ అయిపోయారు. ఇక అతి త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. మరిన్ని విషయాలు షూటింగ్ ప్రారంభం అయ్యాక తెలుస్తాయి.

Tags:    

Similar News