స్టార్ వారసుడితో సందీప్ కిషన్.. అప్డేట్ ఏంటి..?
టాలెంట్ ఉన్నా కూడా లక్ కలిసి రాని యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. దాదాపు కెరీర్ ప్రారంభించి 15 ఏళ్లు అవుతున్నా కూడా కెరీర్ ని నిలబెట్టే ఒక్క సక్సెస్ రాలేదు.;
టాలెంట్ ఉన్నా కూడా లక్ కలిసి రాని యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. దాదాపు కెరీర్ ప్రారంభించి 15 ఏళ్లు అవుతున్నా కూడా కెరీర్ ని నిలబెట్టే ఒక్క సక్సెస్ రాలేదు. కొన్ని సినిమాలు హిట్లు అనిపించుకుంటున్నా క్రేజ్ తీసుకురావడంలో విఫలమవుతున్నాయి. అయినా సరే సందీప్ కిషన్ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సందీప్ కిషన్ మజాకా లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వగా అంచనాలను అందుకోలేదు. నక్కిన త్రినాథరావు మీద ఉన్న నమ్మకంతో సందీప్ ఆ సినిమా చేయగా ప్రీ రిలీజ్ బజ్ బాగున్నా సినిమా మాత్రం ఆశించిన సక్సెస్ అందుకోలేదు.
సంజయ్ డైరెక్షన్ లో సందీప్ కిషన్..
సందీప్ కిషన్ తో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తనయుడు సంజయ్ ఒక సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. సంజయ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా క్రేజీగా ఉండబోతుంది. ఐతే ఈ సినిమా అనౌన్స్ మెంట్ అయితే ఎప్పుడో వచ్చినా షూటింగ్ మాత్రం మొదలు పెట్టలేదు. ఐతే దళపతి విజయ్ పొలిటికల్ గా బిజీగా ఉండటంతో పాటుగా ఈమధ్యనే విజయ్ పార్టీ మీటింగ్ లో తొక్కిసలాట వల్ల కూడా సంజయ్ తొలి సినిమా లాంచింగ్ లేట్ అయ్యిందని తెలుస్తుంది.
కోలీవుడ్ సర్కిల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సంజయ్, సందీప్ కిషన్ సినిమా త్వరలోనే సినిమా ఓపెనింగ్ ఉంటుందట. ఈ సినిమాతో పాటు కృష్ణ చైతన్యతో కూడా సందీప్ కిషన్ ఒక సినిమా చేస్తున్నారు. పవర్ పేట పేట టైటిల్ తో ఆ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా జనవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లానింగ్ జరుగుతుంది. మొత్తానికి సందీప్ కిషన్ నెక్స్ట్ రెండు సినిమాలు భారీ ప్లానింగ్ తోనే వస్తున్నాడు.
తమిళ్ లో మాత్రం కచ్చితంగా క్రేజ్..
సంజయ్ తో సినిమా తెలుగులో ఎలా ఉన్నా తమిళ్ లో మాత్రం కచ్చితంగా క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎలా ఐతే హీరోగా కాకుండా డైరెక్టర్ గా డెబ్యూ ఇచ్చాడో ఇప్పుడు దళపతి విజయ్ తనయుడు సంజయ్ కూడా డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. సందీప్ కిషన్ తో తెలుగు, తమిళ్ బైలింగ్వెల్ మూవీగా ఈ సినిమా రాబోతుంది.
తమిళ్ లో చాలామంది యువ హీరోలు ఉన్నా కూడా సంజయ్ ఏరికోరి తెలుగు యాక్టర్ తో సినిమా చేయడం పట్ల ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. సంజయ్ తో సందీప్ కిషన్ ఫ్రెండ్ షిప్ ఉన్నట్టు తెలుస్తుంది. సందీప్ తెలుగులో హీరోగా చేస్తూనే తమిళ్ లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ వచ్చాడు. ధనుష్ సినిమాల్లో సందీప్ కనిపిస్తాడు. ధనుష్ రాయన్ లో కూడా సందీప్ కిషన్ నటించిన విషయం తెలిసిందే.