• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిరుద్యోగంపై స‌మంత అంత‌గా...

నిరుద్యోగంపై స‌మంత అంత‌గా క‌ల‌త‌కు గురైందా?

| మయోసైటిస్‌(ఆటో ఇమ్యూన్ డిజార్డ‌ర్‌)తో బాధపడుతున్న సమంత కొన్ని నెల‌ల పాటు విరామంలో ఉన్న సంగ‌తి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-02-12 03:52 GMT

మయోసైటిస్‌(ఆటో ఇమ్యూన్ డిజార్డ‌ర్‌)తో బాధపడుతున్న సమంత కొన్ని నెల‌ల పాటు విరామంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఖుషి సినిమా రిలీజ్ త‌ర్వాత ఇంత‌కాలం న‌టిగా బిజీ కాలేదు. తాను విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించిన త‌ర్వాత అప్ప‌టికి సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్‌లన్నింటినీ పూర్తి చేసింది. ఏడు నెల‌లుగా నిరుద్యోగిగా ఉన్న తాను తిరిగి ఉత్సాహంగా ప‌నిలో చేరుతున్నాన‌ని స‌మంత తాజాగా ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఓ పాడ్ కాస్ట్ లో దీనిని ప్ర‌క‌టించ‌డంతో అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. స‌మంత రూత్ ప్రభు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను షేర్ చేసారు. విరామం త‌ర్వాత‌ తిరిగి పనిలో చేరుతున్నాన‌ని ఇందులో అభిమానులకు శుభవార్త అందించారు.

నా స్నేహితురాలితో కలిసి ఏదో సరదాగా ఒక ప‌ని చేస్తున్నాను..ఇది హెల్త్ పాడ్‌కాస్ట్.. ఎవ‌రూ క‌నిపెట్ట‌నిది... నేను నిజంగా ఇష్టపడేది.. ఈ పాడ్ కాస్ట్ విష‌యంలో చాలా ఆస‌క్తిగా ఉన్నాను. వచ్చే వారం విడుదలవుతుంది.. అని స‌మంత తెలిపింది.

ఇటీవ‌లే రాజ్ అండ్ డికె దర్శకత్వం వహించిన సిటాడెల్ భార‌తీయ వెర్ష‌న్‌కి డబ్బింగ్ చెప్పింది. ఈ వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది. ఇదేగాక‌ సమంత ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాతలతో చర్చలు జరుపుతోందని స‌మాచారం. తన తదుపరి ప్రాజెక్ట్‌ను త్వరగా ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలిపారు. 'ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 2' సూపర్ సక్సెస్ తర్వాత హిందీ ప‌రిశ్ర‌మ నుండి అనేక ఆఫర్ లు వెంట‌ప‌డ్డాయి. తాప్సీ నిర్మాణ సంస్థ‌లో స‌మంత న‌టిస్తుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. అలాగే స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న స‌మంత న‌టించే అవ‌కాశం ఉంద‌ని కూడా ప్ర‌చార‌మైంది. అన్ని భారతీయ భాషల్లోనూ ఆసక్తికర సినిమాలు చేయాలని వేచి చూస్తున్న‌ట్టు స‌మంత తెలిపింది. ఇటీవ‌ల కొన్ని ఫ్లాపులు నిరాశ‌ప‌రిచినా కానీ, తిరిగి గ్రేట్ కంబ్యాక్ కోసం సామ్ త‌న ప్ర‌య‌త్నాల్లో ఉంది.

సొంత బ్యాన‌ర్‌లో..

గత సంవత్సరం స‌మంత‌ తన ప్రొడక్షన్ హౌస్‌ని ప్రకటించింది. వీడియోను షేర్ చేస్తూ.. 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్‌'ను ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఇకపై స‌మంత స్వ‌యంగా సినిమాల‌ను నిర్మించే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది.

Tags:    
  • Samantharuthprabhu 
  • Samantha 
  • Unemployement 
  • Filmindustry 
  • Citadelseries 
  • Kushimovie 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS