దివాలీకి ముందే సమంత తారా జువ్వలా!
నీలం రంగు షోల్డర్ లెస్ డిజైన్ లో మతాబులా ఆకట్టుకుంటుంది. సొగసరి ముస్తాబైన విధానం చూపరుల్ని కను తిప్పనివ్వలేదు.;
అప్పుడే వీధుల్లంట పటాస్ ల మోత మొదలైపోయింది. పిల్లలంతా పోటీ పడీ మరి మోతెక్కిస్తున్నారు. ఎవరి టపాస్ ఎంత గొప్పగా పేలిందో? చర్చించుకుంటున్నారు. తాజాగా సమంత కూడా తగ్గేదేలే అంటోంది. వారు సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తే ..నేను సౌండ్ లెస్ పొల్యూషన్ అంటూ ఓ హాట్ పటాస్ తో ముందు కొచ్చేసింది. దివాలీ వారం రోజులు ముందుగానే సొగసరి ఇలా హాట్ పటాస్ లా పేలింది.
నీలం రంగు షోల్డర్ లెస్ డిజైన్ లో మతాబులా ఆకట్టుకుంటుంది. సొగసరి ముస్తాబైన విధానం చూపరుల్ని కను తిప్పనివ్వలేదు. అమ్మడి మ్యాకప్..హెయిర్ స్టైల్..ఎంపిక చేసుకున్న యాక్సరసీస్ ప్రతీది సామ్ ని మరింత అందంగా తీర్చిదిద్దాయి. ప్రస్తుతం సొగసరి వెకేషన్ లో భాగంగా అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచే ఈ డిజైన్ ని షేర్ చేసింది. దివాలీ సందర్భంగా ఈ ట్రీట్ అంటూ ఓ పోస్ట్ చేసింది.
పండుగ ఇంకా వారం రోజులు ముందుగానే ఇలా హాట్ ట్రీట్ షురూ చేసింది. ఇక దివాలీ రోజున సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుందా? లేక సొగసైన దుస్తులతోనే కవ్విస్తుందా? అన్నది ఇప్పుడు హాట్ డిస్కషన్. సామ్ ఎంతో స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుతుంది. తనకి నచ్చినట్లు ఉంటుంది. విమర్శ లొచ్చినా పట్టించు కొదు. సెలబ్రిటీ వరల్డ్ లో ఇలాంటివన్ని చాలా సహజంగా భావించే నటి. అలా ఉంది కాబట్టి జీవితాన్ని అన్ని కోణాల్లో చూడగల్గుతుంది. తన స్వీయా అనుభవాలు చెప్పుకొస్తుంది.
ఇక సామ్ అమెరికా నుంచి తిరిగి రాగానే యధావిధిగా మళ్లీ సినిమాలతో బిజీ అవుతుంది. ఆ రకమైన ప్రణాళిక అమ్మడి వద్ద సిద్దంగా ఉంది. ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్ లు సెట్ చేసి పెట్టుకుంది. చైతో విడాకుల తర్వాత బాలీవుడ్ పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అలాగని టాలీవుడ్ కి దూరం కాలేదు. ఫేమస్ అయిన ఇండస్ట్రీని అశ్రద్ద చేయకుండానే బాలీవుడ్ ప్రణాళిక వేసుకుని ముందుకెళ్తోంది.