సమంతపై రాజ్ తల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. నిజాలు బయటపెడుతూ!

శోభా రాజ్ మాట్లాడుతూ.." సమంత మా కుటుంబంలోకి కోడలుగా రావడం మా అదృష్టం. చాలా మంచి అమ్మాయి. పద్ధతిగా ఉంటుంది.;

Update: 2025-12-07 08:19 GMT

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత.. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత కెరియర్ పై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారిన ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. ఆ నిర్మాణ సంస్థ ద్వారా 'శుభం' అనే సినిమాను నిర్మించి.. మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో మాయ అనే ఒక చిన్న పాత్ర కూడా పోషించింది. ఇకపోతే కెరియర్ పైనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా సెటిల్ కావాలనుకున్న సమంత.. అందులో భాగంగానే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలోనే ఆ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారగా.. డిసెంబర్ 1న కోయంబత్తూర్ లోని ఈషా యోగా సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

వివాహాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. సమంత తన ఇంస్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫోటోలను పంచుకుంది. దీంతో అభిమానులు, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సమంత స్నేహితురాలు శిల్పారెడ్డి కూడా షేర్ చేసింది. ఇదిలా ఉండగా తాజాగా సమంతపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ప్రముఖ సింగర్, రాజ్ చిన్నమ్మ శోభ రాజ్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. సమంత, రాజ్ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకోవడమే కాకుండా సమంత గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు కూడా ఆమె బయట పెట్టింది.

శోభా రాజ్ మాట్లాడుతూ.." సమంత మా కుటుంబంలోకి కోడలుగా రావడం మా అదృష్టం. చాలా మంచి అమ్మాయి. పద్ధతిగా ఉంటుంది. పెళ్లి చీరలో చాలా ముచ్చటగా అనిపించింది. ముఖ్యంగా ఆ అమ్మాయి మా రాజ్ జీవితంలోకి రావడం మరింత సంతోషంగా ఉంది" అంటూ తెలిపింది. అలాగే సమంత గురించి మాట్లాడుతూ.. "ఈషా ఫౌండేషన్ లో సమంతను ఇప్పటికే రెండు మూడు సార్లు కలిసాను. ఆ సమయంలో ఆమె చాలా సన్నగా ఉండేది. అంత సన్నగా ఉన్న అమ్మాయి పక్కన కూర్చోవాలంటే నాకు సిగ్గుగా అనిపించింది. అప్పుడే నేను కూడా కొంచెం సన్నగా అవ్వాలంటే ఏం చేయాలని అడిగాను. అయితే నాకు కొన్ని వర్కౌట్స్ చెప్పింది. అయితే అవి ఫాలో అవ్వడం నావల్ల కాదని సమంతతో చెప్పేసాను. అలా ఆమెతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. ఆమె చాలా మంచి అమ్మాయి. అందరి మంచి కోరుకునే అమ్మాయి. అలాంటి అమ్మాయి మా జీవితంలోకి రావడం మరింత సంతోషంగా అనిపిస్తుంది. ముఖ్యంగా దేవుడిపై ఎంతో భక్తి ఉన్న అమ్మాయి. రాజ్ కి కూడా దైవభక్తి ఎక్కువ" అంటూ సమంతపై తన ప్రేమను వలకబోసింది సమంత అత్త.

Tags:    

Similar News