సామ్, రాజ్ దుబాయ్ టూర్.. శ్యామాలి ఏమందంటే?
రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలను చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందని అంతా ఫిక్స్ అయ్యారు.;
స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు డేటింగ్ లో ఉన్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయా వార్తలకు మరింత ప్రాధాన్యం చేకూర్చేలా సామ్ పోస్టులు ఉంటున్నాయి. కొన్ని నెలలుగా రాజ్ తో సామ్ సన్నిహితంగా కనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ ను ఆమెనే పోస్ట్ చేస్తున్నారు.
రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలను చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందని అంతా ఫిక్స్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం సమంత భుజంపై రాజ్ చేయి వేసి నడిచారు. అమెరికా టూర్ లో ఇద్దరూ హ్యాపీ మూడ్ లో కనిపించారు. ఆ తర్వాత ఒకే కారులో కనిపించి హాట్ టాపిక్ గా మారారు. రీసెంట్ గా దుబాయ్ టూర్ కు కూడా వెళ్లారు!
దుబాయ్ మూమెంట్స్ ను సామ్ షేర్ చేయగా.. అందులో ఆమె వ్యక్తి చెయ్యి పట్టుకుని కనిపించారు. ఆ వ్యక్తి కచ్చితంగా రాజ్ నే అని అభిమానులు డిసైడ్ అయ్యారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. అయితే ఆ ఫొటో అంతటా వైరల్‌గా మారిన తరుణంలో రాజ్ సతీమణి శ్యామాలి తాజాగా సందేశాత్మక పోస్ట్ పెట్టారు.
"నిర్లిప్తత అంటే మీరు ఏం సొంతం చేసుకోకూడదు అని కాదు. కానీ ఏదీ మిమ్మల్ని సొంతం చేసుకోకూడదు:" అంటూ రాసుకొచ్చారు. శ్యామాలి తరచుగా ఇలాంటి సందేశాత్మక పోస్ట్‌లు షేర్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు రాజ్- సమంతలపై వార్తలు వస్తున్నప్పటినుంచి ఆమె పోస్ట్‌లపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి.
ఇక శ్యామాలి విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్ దర్శకులు రాకేశ్ ఓం ప్రకాశ్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కొంతకలాంపాటు వర్క్ చేశారు. రంగ్ దే బసంతి, ఓంకార సినిమాలకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా పని చేశారు. 2015లో రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. వారిద్దరికి ఇప్పటికే ఒక పాప ఉందని సమాచారం.
అయితే రాజ్ తో పెళ్లయ్యాక ఆయన రూపొందించిన సినిమాలకు క్యాస్టింగ్ లో సాయం చేస్తుండేవారు శ్యామాలి. అదే సమయంలో కొంతకాలంగా వారిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. శ్యామాలి చివరిసారి 2023లో రాజ్ తో కలిసున్న పిక్ షేర్ చేశారు. ఏదేమైనా రాజ్ తో సామ్ ఉన్న పిక్స్, వీడియోస్ ప్రత్యక్షమైతే మాత్రం కచ్చితంగా పోస్టులు పెడుతున్నారు. మరేం జరుగుతుందో వారికే తెలియాలి.