మళ్లీ క్రిప్టిక్ పోస్ట్.. ఇంతకీ సామ్ ఏం చెప్పదలిచింది?
ఇదిలా ఉంటే సమంత కొద్దిరోజులుగా తమపై వస్తున్న పుకార్లకు నేరుగా స్పందించకపోయినా సోషల్ మీడియాల్లో గుంభనగా వ్యాఖ్యానిస్తున్నారు.;
అక్కినేని నాగచైతన్య నుంచి సమంత రూత్ ప్రభు విడాకుల తర్వాత కొంత కాలంగా రకరకాల కారణాలతో మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. సామ్ ఇటీవల ఫ్యామిలీమ్యాన్ ఫేం రాజ్ నిడిమోరుతో రిలేషన్ లో ఉందని పుకార్లు షికార్ చేస్తున్నాయి.
ఆ ఇద్దరూ తమ సంబంధాన్ని ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు. దీంతో ఈ జంట ప్రేమలో ఉన్నారని నెటిజనులు ఊహిస్తున్నారు. `ది ఫ్యామిలీ మ్యాన్` సీజన్ 2 తర్వాతా `సిటాడెల్: హనీ బన్నీ` అనే వెబ్ సిరీస్ కోసం కలిసి పనిచేశారు. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ కోసం పని చేస్తున్నారు. సమంత సొంత బ్యానర్ లో నిర్మించిన `శుభం` సినిమాకి రాజ్ నిడుమోరు అన్నీ తానే అయ్యి కథంతా నడిపించాడని కూడా గుసగుసలు వినిపించాయి.
ఇదిలా ఉంటే సమంత కొద్దిరోజులుగా తమపై వస్తున్న పుకార్లకు నేరుగా స్పందించకపోయినా సోషల్ మీడియాల్లో గుంభనగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం విదేశీ విహారయాత్రలో ఉన్న సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏ ``అల మిగిలి ఉండదు, ఏ తుఫాను కూడా నిలిచిపోదు, అన్నీ దాటిపోవాలి, తర్వాత తమ దారి వెతుక్కోవాలి!`` అని సమంత రాసింది. సమంతా రూత్ ప్రభు తన బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం తీసుకుని అబుదాబిలో ప్రశాంతంగా, విశ్రాంతిగా గడిపేందుకు వెళ్లింది. వెకేషన్స్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ పై వ్యాఖ్యను రాసింది. ఇసుక ఎడారిలో సూర్యాస్తమయాన్ని ఆస్వాధించే ఫోటో సహా చాలా ఫోటోలు ఆకట్టుకున్నాయి. ఒక ఫోటోలో పూల్ సైడ్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు కూడా కనిపించింది. ఒక ఫోటోలో టోపీ, స్లింగ్ బ్యాగ్, సన్ గ్లాసెస్ తో స్టైలిష్ లుక్ లో కనిపించింది.
సమంత రూత్ ప్రభు - నాగ చైతన్య జంట 2021లో విడిపోయారు. మరోవైపు రాజ్ తన మొదటి భార్య శ్యామలి దేకు విడాకులు ఇచ్చారు. వారికి ఒక కుమార్తె ఉన్నారని కథనాలొచ్చాయి. కెరీర్ పరంగా సమంత రూత్ ప్రభు తదుపరి సిరీస్ `రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్‌డమ్`లో కనిపిస్తుంది. దీనిని రాజ్ నిడిమోరు- కృష్ణ డికె నిర్మించారు. రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించారు. ఈ కథాంశం మరాఠీ చిన్న కథ `విదుషక్` ఆధారంగా రూపొందింది. ఇది ఇద్దరు యువరాజులు సింహాసనం కోసం ఎలాంటి పోరాటం సాగించారనే కల్పిత రాజ్యానికి సంబంధించిన కథాంశం. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, సమంతా రూత్ ప్రభు, వామికా గబ్బి, జైదీప్ అహ్లవత్ తదితరులు నటించారు.