సమంత శుభం ట్రైలర్ వచ్చేస్తోంది
విభిన్నమైన కథతో దాదాపు కొత్త నటీనటులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మే 9న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.;
క్రేజీ హీరోయిన్ సమంత తొలి సారి నిర్మాతగా మారి నిర్మించిన థ్రిల్లర్ మూవీ 'శుభం'. హర్షిత్‌రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని తొలి సారి నిర్మాతగా మారి సమంత నిర్మించడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇటీవల విడుదల చేసిన టీజర్ కూడా ఆసక్తిని రేకెత్తించిన విషయం తెలిసిందే. మీఆకు శుభం కలుగుగాక' అని ట్యాగ్ లైన్.
కొత్త జంట పెళ్లి నేపథ్యంలో సాగే కామెడీ థ్రిల్లర్‌గా ఈ మూవీని ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో ట్రైలర్ ఎలా ఉంటుందా? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమ్ ట్రైలర్ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్‌ని గురువారం ఇచ్చేసింది. ట్రైలర్ ఎనీడే, ఎనీ టైమ్ రిలీజ్ కావచ్చు అంటూ ఓ పోస్టర్‌ని విడుదల కావచ్చని హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ని షేర్ చేసింది.
దీంతో 'శుభం' ట్రైలర్ రిలీజ్‌పై అందరిలో ఆసక్తి మొదలైంది. విభిన్నమైన కథతో దాదాపు కొత్త నటీనటులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మే 9న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మూవీకి వివేక్ సాగర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం తెలుగులో 'మా ఇంటి బంగారం', హిందీలో రాజ్ అండ్ డీకె తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ్'లో నటిస్తోంది. ఇందులో 'మా ఇంటి బంగారం' మూవీకి సమంతే నిర్మాత.