కొత్త పోరాటాన్ని ప్రారంభిస్తా : సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మొదటి సినిమా 'ఏమాయ చేశావే' 2010లో విడుదలైంది. నాగ చైతన్య హీరోగా నటించిన ఆ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది.;
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మొదటి సినిమా 'ఏమాయ చేశావే' 2010లో విడుదలైంది. నాగ చైతన్య హీరోగా నటించిన ఆ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ 15 ఏళ్లు కొనసాగడం ఈ తరం హీరోయిన్స్‌లో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఈమధ్య కాలంలో వస్తున్న హీరోయిన్స్ రెండు మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే కనిపించకుండా పోతున్నారు. స్టార్ హీరోయిన్స్‌తో కలిసి నటించిన స్టార్ హీరోయిన్స్ సైతం రెండు మూడు ఏళ్లకి కనుమరుగు అవుతున్నారు. స్టార్ హీరోయిన్స్ సైతం నాలుగు అయిదు సంవత్సరాలకే కనుమరుగు అవుతున్నారు. కానీ సమంత మాత్రం ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 ఏళ్లు అయినా ఇంకా స్టార్ స్టేటస్‌తో దూసుకు పోతుంది.
ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన సమంత దాదాపు అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించింది. టాలీవుడ్‌లో దాదాపు పదేళ్ల పాటు వరుసగా సినిమాలు చేసిన సమంత ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్‌కి పరిమితం అయింది. అక్కడ సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లను చేస్తున్న విషయం తెల్సిందే. ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ సిరీస్‌లకు మంచి స్పందన రావడంతో మరో రెండు వెబ్ సిరీస్‌లు సైతం ఈమె చేస్తుంది. మరో వైపు హిందీ సినిమాల్లోనూ నటించేందుకు రెడీ అవుతుంది. సౌత్ సినిమాలపై కంటే నార్త్ ప్రాజెక్ట్‌లపై ఈ అమ్మడు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. తాజాగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేసింది.
15 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత స్పందిస్తూ... అప్పుడే ఏమీ అయిపోలేదు, తాను చేయాల్సిన ప్రయాణం ఇంకా చాలా ఉంది. తాను చేయాల్సిన పోరాటం ఇంకా చాలా ఉందని భావిస్తున్నాను అంది. సాధారణంగా ఓసారి ఆకాశమంత విజయం దక్కితే చాలా మంది సంతృప్తితో తమ ప్రయాణంను ఆపేస్తారు. తాము చాలా సాధించాం, చాలా విజయాలను సొంతం చేసుకున్నాం అంటారు. కానీ తాను మాత్రం అలా కాదని సమంత చెప్పుకొచ్చింది. 15 ఏళ్ల సినీ జర్నీ తర్వాత తాను కొత్తగా ప్రయాణం ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
ఇన్నాళ్ల జర్నీతో తాను విశ్రాంతి తీసుకోవాలని కోరుకోవడం లేదు. ముందు ముందు నా నుంచి చాలా కొత్త ప్రాజెక్ట్‌లు వస్తాయంటూ ఫ్యాన్స్‌కి హామీ ఇచ్చింది. తాను ఎప్పుడూ విజయాలతో సంతృప్తిని చెందను అంది. ఇకపై కొత్తగా పోరాటంను ప్రారంభిస్తాను అంది. 15 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ ఇకపై కొత్తగా తాను జర్నీని మొదలు పెట్టి ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు శ్రమిస్తాను అంది. విజయం దక్కినా, పరాజయం వచ్చినా పోరాడటమే తన తత్వం అని, అదే తన విజయ సూత్రం అని సమంత చెప్పుకొచ్చింది. సమంత జోష్, ఆమె ఉత్సాహం చూస్తూ ఉంటే మరో 15 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గానే అక్కడ, ఇక్కడ కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.